Exim Bank : ఎగ్జిమ్ బ్యాంక్ లో ఒప్పంద పోస్టుల భర్తీ
అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి గ్రాడ్యుయేషన్ , బీఈ, బీటెక్, ఎంబీఏ, పీజీడీబీఏ, సీఏ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. పని అనుభవం కలిగి ఉండాలి.

Exim Bank
Exim Bank : భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఎక్స్ పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్ బ్యాంక్) లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంప్లియన్స్, లీగల్, రాజ్ భాష, ఐటీ, హ్యూమన్ రిసోర్స్, రిస్క్ మేనేజ్ మెంట్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి గ్రాడ్యుయేషన్ , బీఈ, బీటెక్, ఎంబీఏ, పీజీడీబీఏ, సీఏ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. పని అనుభవం కలిగి ఉండాలి. ఎంపిక విధానం విషయానికి వస్తే షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూల అధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరితేదిగా ఏప్రిల్ 28, 2022ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.eximbankindia.in/ పరిశీలించగలరు.