JOBS : టీఎస్ఎస్ పీడీసీఎల్ లో ఎలక్ట్రికల్ సబ్ ఇంజినీర్ పోస్టుల భర్తీ

అభ్యర్ధుల వయస్సు 18 ఏళ్ల నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రాత పరీక్ష అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.

JOBS : టీఎస్ఎస్ పీడీసీఎల్ లో ఎలక్ట్రికల్ సబ్ ఇంజినీర్ పోస్టుల భర్తీ

Jobs

Updated On : June 15, 2022 / 8:55 PM IST

JOBS : సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్ (టీఎస్ఎస్ పీడీసీఎల్) 201 సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. అసక్తిగల , అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, డిప్లొమా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.

అభ్యర్ధుల వయస్సు 18 ఏళ్ల నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రాత పరీక్ష అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు 200 చెల్లించాలి. దరఖాస్తు ప్రక్రియ కు చివరి తేదిగా జులై 5, 2022ను నిర్ణయించారు. పరీక్షను 31 జులై , 2022 నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://tssouthernpower.cgg.gov.in పరిశీలించగలరు.