JOBS : ఓఎన్జీసీ కాకినాడ లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

అకడమిక్ మెరిట్, ఇంటర్య్వూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు వేతనంగా 1,00,000 నుండి 1,05,000ల వరకు చెల్లిస్తారు. ఆసక్తిగల అభ్యర్ధులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది.

JOBS : ఓఎన్జీసీ కాకినాడ లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

Ongc Jobs

Updated On : June 18, 2022 / 9:30 PM IST

JOBS : భారత ప్రభుత్వ రంగ సంస్ధ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) కాకినాడ యూనిట్ లో మెడికల్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 7 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఎంబీబీఎస్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతోపాటుగా సెంట్రల్ మెడికల్ కౌన్సిల్, స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టరై ఉండాలి.

అకడమిక్ మెరిట్, ఇంటర్య్వూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు వేతనంగా 1,00,000 నుండి 1,05,000ల వరకు చెల్లిస్తారు. ఆసక్తిగల అభ్యర్ధులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; అయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ లిమిటెడ్, ఈఓఏ అండ్ హెచ్ పీహెచ్ టీ, కాకినాడ. ఇంటర్వ్యూ తేది జూన్ 23, 2022గా ప్రకటించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.ongcindia.com./maintenancepage/index.html పరిశీలించగలరు.