Iit Jammu : జమ్ము ఐఐటీలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ
అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ధరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్ధులు 1,000 రూపాయలు చెల్లించాలి.

Iit Jammu
Iit Jammu : జమ్మూలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్ వంటి నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయా పోస్టుల్ని అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 31 సంవత్సరాల నుండి 55 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టులను అనుసరించి నెలకు 21,700 రూపాయల నుండి 2,15,900 రూపాయలు వేతనం చెల్లిస్తారు. రాత పరీక్ష, ప్రొఫిషియెన్సీ టెస్ట్, కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ధరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్ధులు 1,000 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ధరఖాస్తులకు చివరి తేది నవంబరు 26గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ http-s://iitjam-mu.ac.in/