Iti Jobs : ఐటీఐ లిమిటెడ్ లో పోస్టుల భర్తీ

డిప్యూటీ మేనేజర్ తోపాటు మేనేజర్ పోస్టులకు సంబంధించి 8 ఖాళీలు ఉన్నాయి. దీనికి కూడా 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.

Iti Jobs : ఐటీఐ లిమిటెడ్ లో పోస్టుల భర్తీ

Iti Jobs

Updated On : October 31, 2021 / 10:33 AM IST

Iti Jobs : భారత ప్రభుత్వ కమ్యునికేషన్స్ మంత్రిత్వశాఖకు చెందిన బెంగుళూరులోని ఐటీఐ లిమిటెడ్ లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ)12 ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించి కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 సంవత్సరాలు మించరాదు. నెలకు 43,129రూపాయల వేతనంగా చెల్లిస్తారు.

డిప్యూటీ మేనేజర్ తోపాటు మేనేజర్ పోస్టులకు సంబంధించి 8 ఖాళీలు ఉన్నాయి. దీనికి కూడా 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి. డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి వయస్సు 40ఏళ్లు, మేనేజర్ ఉద్యోగానికి వయస్సు 42 ఏళ్లు మించరాదు. డిప్యూటీ మేనేజర్ కు నెలకు 65,195రూపాయలు వేతనంగా చెల్లిస్తారు. మేనేజర్ కు నెలకు 72,712రూపాయలు చెల్లిస్తారు.

షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధుల ఎంపిక విధానం ఉంటుంది. అభ్యర్ధులు తమ ధరఖాస్తులను ఆన్ లైన్ , ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. అన్ లైన్ ధరఖాస్తులు పంపేందుకు నవంబరు 11 చివరి తేదికాగా, ఆఫ్ లైన్ ధరఖాస్తులను పంపేందుకు నవంబరు 15 చివరి తేదిగా నిర్ణయించారు. ధరఖాస్తులు పంపాల్సిన చిరునామా; జనరల్ మేనేజర్ హెచ్ ఆర్, ఐటీఐ లిమిటెడ్, ఐటిఐ భవన్, దూరవాణి నగర్, బెంగుళూరు-560016. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.itiltd.in