Sai jobs : న్యూదిల్లో స్పోర్ట్స్ అథారిటీలో పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం కలిగి ఉన్నవారు అర్హులు. అభ్యర్ధుల వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు.

Sai Jobs
Sai jobs : భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖు చెందిన న్యూదిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో ఖాళీ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 జనరల్ మేనేజ్ మెంట్ యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం కలిగి ఉన్నవారు అర్హులు. అభ్యర్ధుల వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ అధారంగా ఉంటుంది. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 27, 2022 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తులకు ఆఖరు తేది 2022 , మే 12గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://sportsauthorityofindia.nic.in/sai/ పరిశీలించగలరు.