Bibinagar Aims : తెలంగాణా బీబీనగర్ ఎయిమ్స్ లో పోస్టుల భర్తీ

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. టీచింగ్, పరిశోధన అనుభవం ఉండాలి. నాన్ మెడికల్ అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెల్సీ ఉత్తీర్ణలై ఉండాలి.

Bibinagar Aims : తెలంగాణా బీబీనగర్ ఎయిమ్స్ లో పోస్టుల భర్తీ

Bibinagar Aims

Updated On : June 9, 2022 / 2:52 PM IST

Bibinagar Aims : తెలంగాణా పరిధిలోని బీబీనగర్ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో వివిధ విభాగాల్లో టీచింగ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 94 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో ప్రొఫెసర్లు పోస్టులు 29, అడిషనల్ ప్రొఫెసర్లు 11, అసోసియేట్ ప్రొఫెసర్లు 18, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 36 ఖాళీలు ఉన్నాయి. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ తదితర విభాగాల్లో ఈఖాళీలు ఉన్నాయి.

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. టీచింగ్, పరిశోధన అనుభవం ఉండాలి. నాన్ మెడికల్ అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెల్సీ ఉత్తీర్ణలై ఉండాలి. దరఖాస్తులను ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా 1500రూ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://aiimsbibinagar.edu.in/ పరిశీలించగలరు.