BEL Recruitment : బెల్ లో సీనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ

అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే రాత పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.

BEL Recruitment : బెల్ లో సీనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ

Bel

Updated On : March 3, 2022 / 1:25 PM IST

BEL Recruitment : బెంగుళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ లో సీనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ధరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగిన వారు దరఖాస్తుకు అర్హులు.

అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే రాత పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; మేనేజర్ హెచ్ ఆర్, బెల్ జలహళ్లి, బెంగళూరు-560013. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; WWW.bel-india.in/ సంప్రదించగలరు.