ITBP JOBS : ఐటీబీపీలో పలు పోస్టుల భర్తీ

అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంటేషన్, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, అధారంగా ఎంపిక చేస్తారు.

ITBP JOBS : ఐటీబీపీలో పలు పోస్టుల భర్తీ

Itbp

Updated On : June 7, 2022 / 3:22 PM IST

ITBP JOBS : ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 38 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్, స్టెనో గ్రాఫర్ డైరెక్ట్ ఎంట్రీ 21 ఖాళీలు, అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ స్టెనోగ్రాఫర్ ఎల్డీసీఈ 17 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇంటర్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంటేషన్, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, అధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు జులై 7, 2022ను చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://itbpolice.nic.in/ పరిశీలించగలరు.