Indian Bank : ఇండియన్ బ్యాంక్ లో స్పోర్ట్స్ కోటా క్లర్క్ పోస్టుల భర్తీ

సంబంధిత క్రీడల్లో జాతీయ స్ధాయి , జూనియర్, సీనియర్, నేషనల్స్ లో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 సంవత్సరాల నుండి 26 ఏళ్ల మధ్య ఉండాలి.

Indian Bank : ఇండియన్ బ్యాంక్ లో స్పోర్ట్స్ కోటా క్లర్క్ పోస్టుల భర్తీ

Indian Bank Jobs

Updated On : May 3, 2022 / 10:17 AM IST

Indian Bank : చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ క్లర్క్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 12క్లర్క్ , జేజీఎం పోస్టులను భర్తీ చేయనున్నారు. అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, క్రికెట్, హాకీ, వాలీబాల్ వంటి క్రీడాంశాల్లో ఖాళీలను భర్తీ చేస్తారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి.

దానితోపాటు సంబంధిత క్రీడల్లో జాతీయ స్ధాయి , జూనియర్, సీనియర్, నేషనల్స్ లో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 సంవత్సరాల నుండి 26 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే దరఖాస్తుల స్క్రీనింగ్, ట్రయల్స్ లో ప్రతిభ అధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది మే 14, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://www.indianbank.net.in/ పరిశీలించగలరు.