RPF GRP-C కానిస్టేబుల్ ఫలితాలు విడుదల

  • Published By: veegamteam ,Published On : May 16, 2019 / 08:41 AM IST
RPF GRP-C కానిస్టేబుల్ ఫలితాలు విడుదల

Updated On : May 16, 2019 / 8:41 AM IST

రైల్వేల్లో కానిస్టేబుల్  GRP-C పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ బుధవారం (మే 15న) ఉదయం విడుదల చేసింది. RPF కానిస్టేబుల్ గ్రూప్-సి పోస్టులకు నిర్వహించిన పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. రాతపరీక్షకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లు (PET, PMT), ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. 

రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్‌లో మొత్తం 8,619 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గతేడాది నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. వీటిలో 4402 పోస్టులను పురుషులకు కేటాయించగా.. 4216 పోస్టులకు మహిళలకు కేటాయించారు. ఈ పోస్టులకు గతేడాది డిసెంబరు 20 నుంచి జనవరి 25 వరకు రాతపరీక్షలు నిర్వహించారు. ఈ సంవత్సరం పరీక్షలో ఎంపికైన వారికి జూన్ 10, 2019న ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు.