HAL Recruitment 2023 : 2లక్షలకు పైగా జీతం… హిందూస్ధాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు
Latest Job Notification 2023: దరఖాస్తుల ఆధారంగా, అర్హతగల అభ్యర్థులను స్కీనింగ్ ద్వారా షార్ట్ లిస్టు చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ తేదీ, సమయం , వేదిక ఇతర వివరాలను అభ్యర్ధులకు మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు.

HAL RECRUITMENT
హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ పైలట్, చీఫ్ మేనేజర్, మేనేజర్, ఇంజనీర్, ఫైనాన్స్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్‌తో సహా అనేక పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి,అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అనేది ఆసియాలో ఏరోనాటికల్ కాంప్లెక్స్, డిజైన్, ఉత్పత్తి, మరమ్మత్తు, పునర్నిర్మాణం చేపట్టడం మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని ముందుకు తీసుకువెళుతోంది. ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్లు, ఏరో-ఇంజిన్‌లు, ఉపకరణాలు, ఏవియానిక్స్ మరియు సిస్టమ్‌ల అప్‌గ్రేడ్. HAL 20 ఉత్పత్తి విభాగాలను, 10 R&D కేంద్రాలను, సౌకర్యాల నిర్వహణ విభాగాలను కలిగి ఉంది. భారతదేశంలోని ఏడు రాష్ట్రాలు, తొమ్మిది భౌగోళిక ప్రదేశాలలో విస్తరించి కార్యకలాపాలు కొనసాగిస్తుంది.
READ ALSO : Free Training :సెల్ ఫోన్ రిపేర్, సీసీ కెమెరా ఇన్ స్టాలేషన్ లో ఉచిత శిక్షణ.. పూర్తి వివరాలు ఇవే !
అర్హత
ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు ఇతర డిగ్రీలను వివిధ పోస్టులకు విద్యార్హతలుగా నిర్ణయించారు. పని అనుభవం కూడా కలిగి ఉండాలి. రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ చూడటం ద్వారా అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఎంపిక విధానం
దరఖాస్తుల ఆధారంగా, అర్హతగల అభ్యర్థులను స్కీనింగ్ ద్వారా షార్ట్ లిస్టు చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ తేదీ, సమయం , వేదిక ఇతర వివరాలను అభ్యర్ధులకు మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు.
READ ALSO : Heart Healthy : బీట్‌రూట్ , బచ్చలికూర జ్యూస్ తో పాటు గుండెను ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడే 5 పానీయాలు !
వేతనం
గ్రేడ్ 2-రూ 40,000 -రూ. 1,40,000
గ్రేడ్ ౩-రూ. 50,000 -రూ. 1,60,000
గ్రేడ్ 4-రూ 60,000 -రూ 1,80,000
గ్రేడ్ 5 -రూ 70,000 -రూ 2,00,000
గ్రేడ్ 6-రూ. 80,000 -రూ. 2,20,000
గ్రేడ్ 7 -రూ 90,000 -రూ 2,40,000
READ ALSO : Protect Heart Health : మధుమేహాం సమస్యతో బాధపడుతున్న వారు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏంచేయాలంటే !
దరఖాస్తు విధానం
దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ hal-india.co.in లో దరఖాస్తు ఫారాలను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత ఫార్మాట్‌లో వివరాలను పూరించి అవసరమైన పత్రాలను జతపరిచి Chief Manager(HR), Recruitment Section, Hindustan Aeronautics Limited, CorporateOffice, 15/1 CubbonRoad, Bangalore – 560 001 అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది.