Free Training :సెల్ ఫోన్ రిపేర్, సీసీ కెమెరా ఇన్ స్టాలేషన్ లో ఉచిత శిక్షణ.. పూర్తి వివరాలు ఇవే !
నవంబరు 8 వ తేదీ నుంచి ఉచిత శిక్షణ ప్రారంభం కానుంది. నెల రోజులపాటు సెల్ఫోన్ రిపేరీ మరియు సీసీటీవీ కెమెరా ఇన్సాలేషన్ రిపేరిలో నిపుణుల సమక్షంలో తర్ఫీదునిస్తారు. శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పించనున్నారు.

phone-repairs
Free Training : నిరుద్యోగ యువకులకు కెనరా బ్యాంక్ విన్నూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని నిరుద్యోగుల కోసం ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పదవ తరగతి ఇంటర్ డిగ్రీ ఆపై చదువులు చదివినా, లేదంటే చదువు మధ్యలో ఆపేసిన యువకులకు సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ మరియు రిపేర్ చేయడం అదే విధంగా సెల్ ఫోన్లు రిపేర్ చేయడంలో ఉచితంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
READ ALSO : Most Expensive Hotel : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్‌లో రాత్రి బస చేయాలంటే…
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కర్నూల్ పట్టణంలోని కల్లూరు కెనరా బ్యాంక్ రీజినల్ డైరెక్టర్ బి.శివప్రసాద్ కోరారు. నెల రోజుల పాటు ఈ ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని అనుభవజ్ఞులైన నిపుణులతో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇటీ వలి కాలంలో సెల్ ఫోన్ ల వినియోగం పెరగటంతోపాటు, ఇల్లు, ఆఫీసుల్లో సీసి కెమెరాల వినియోగం పెరిగిన నేపధ్యంలో వాటి ఇన్సాస్టాలేషన్, రిపేరు కోసం టెక్నికల్ అనుభవం కలిగిన వారి అవసరత ఏర్పడిందన్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పటు చేశామన్నారు.
READ ALSO : వాట్సాప్‌లో డిలీటెడ్ మెసేజ్ చూడాలంటే?
నవంబరు 8వ తేదీ నుంచి ఉచిత శిక్షణ ప్రారంభం కానుంది. నెల రోజులపాటు సెల్ఫోన్ రిపేరీ మరియు సీసీటీవీ కెమెరా ఇన్సాలేషన్ రిపేరిలో నిపుణుల సమక్షంలో తర్ఫీదునిస్తారు. శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పించనున్నారు. శిక్షణ తీసుకున్న అభ్యర్థులు శిక్షణ పూర్తయిన అనంతరం కెనరా బ్యాంక్ సంస్థ తరపున గుర్తింపు సర్టిఫికెట్ అందజేయనుంది. సొంతంగా షాపులు పెట్టుకోవాలనుకునే వారికి కెనరా బ్యాంకు ఈ సర్టిఫికెట్ ఆధారంగా లోన్లు ఇవ్వనుంది.
READ ALSO : Tobacco Cultivation : ప్రోట్రేలలో పొగాకు నారు పెంపకం.. అదనపు ఆదాయం పొందుతున్న రైతు
సెల్ ఫోన్ రిపేరింగ్, సీసీటీవీ కెమెరా ఇన్నాలేషన్ లో శిక్షణ తీసుకోవాలనుకునే అభ్యర్థులు తన బయోడేటా, ఆధార్ కార్డు, తల్లిదండ్రుల ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, స్టడీ సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులతో సంప్రదించాల్సిన చిరునామా కర్నూల్ పట్టణంలోని కల్లూరు తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న కెనరా బ్యాంక్ కార్యాలయం. మరింత సమాచారం కోసం 90007 10508, 63044 91236 ఫోన్ నంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.