SBI PO 2025: ఎస్బీఐ పీవో ప్రిలిమ్స్ ఎగ్జామ్ అప్డేట్.. అడ్మిట్ కార్డు, మెయిన్స్, ముఖ్యమైన తేదీల వివరాలు
SBI PO 2025: 541 ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తుండగా వీటిలో 500 రెగ్యులర్ పోస్టులు, 41 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి.

SBI PO Prelims Exam, Admit Card, Mains Exam, Important Dates Details
ఎస్బీఐ పీవో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. మొత్తం 541 ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తుండగా వీటిలో 500 రెగ్యులర్ పోస్టులు, 41 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధుకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కోసం ఎదురుచూస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు ఎస్బీఐ పీవో ప్రిలిమ్స్ పరీక్షలు ఆగస్టు 2, 4, 5వ తేదీన జరుగనున్నాయి. ఈ పరీక్షలకు సంబందించిన ఫలితాలు ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ మొదటివారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. అడ్మిట్ కార్డులు ఆగస్టు 5న విడుదల కానున్నాయి. ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in ద్వారా పొందవచ్చు.
ఇక ఎస్బీఐ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఎస్బీఐ పీఓ మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హత పొందుతారు. ఈ పరీక్ష సెప్టెంబర్‌లో ఉంటుంది ఫలితాలు సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్‌లో వస్తాయి. దీనికి సంబందించిన అడ్మిట్ కార్డులు ఆగస్టు, సెప్టెంబర్‌లో అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలవుతాయి. అనంతరం సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్‌సైజ్‌లు అక్టోబర్ లేదా నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది.
మీ అడ్మిట్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి:
అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ sbi.co.in లోకి వెళ్ళాలి.
హోమ్ పేజీలో కెరీర్స్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి
అందులో కరెంట్ ఓపెనింగ్స్ విభాగాన్ని సెలెక్ట్ చేసుకోవాలి
ఎస్బీఐ పీవో ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయాలి.
మీ వివరాలను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
స్క్రీన్‌పై మీ అడ్మిట్ కార్డు డిస్ప్లే అవుతుంది
దానిని డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింటౌట్ తీసుకోవాలి.