రెడీ టు అప్లయ్ : SBIలో 8వేల 904 క్లర్క్ పోస్టులు

  • Published By: veegamteam ,Published On : April 12, 2019 / 02:02 AM IST
రెడీ టు అప్లయ్ : SBIలో 8వేల 904 క్లర్క్ పోస్టులు

Updated On : April 12, 2019 / 2:02 AM IST

బ్యాంక్ జాబ్ సాధించాలని చూస్తున్న వారి కోసం గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) జూనియర్ అసోసియేట్స్ (క్లర్క్, కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అప్లికేషన్ ఫీజుగా రూ.750 చెల్లించాలి. ఏప్రిల్ 12 నుంచి మే 3 వరకు ఆన్‌లైన్ లో అప్లయ్ చేసుకోవాలి.
Read Also : రెడీ టు అప్లయ్ : SBIలో 8వేల 904 క్లర్క్ పోస్టులు

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది. ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్షల ద్వారా ఉద్యోగ ఎంపికలు చేస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో పాస్ అయిన వారు మెయిన్ పరీక్షలకు అర్హత పొందుతారు. అభ్యర్థులకు జూన్‌లో మొదటి విడత పరీక్ష (ప్రిలిమినరీ), ఆగస్టులో రెండో విడత (మెయిన్) పరీక్ష నిర్వహిస్తారు.

పోస్టుల వివరాలు:

జూనియర్ అసోసియేట్స్ (క్లర్క్): 8,904 పోస్టులు (తెలంగాణ-425, ఏపీ-253)
* కేటగిరీ      పోస్టులు
* రెగ్యులర్      8593
* బ్యాక్‌లాగ్ 251
* స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ (రెగ్యులర్) 60
* మొత్తం పోస్టులు 8,904
విభాగాలు: కస్టమర్ సపోర్ట్, సేల్స్.
అర్హత: ఏదైనా డిగ్రీ.

ఏజ్ లిమిట్: 01.04.2019 నాటికి 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.04.1991 – 01.04.1999 సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

పరీక్ష ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.125

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ రాతపరీక్షలు, గ్రూప్ డిస్కషన్, ఇంట‌ర్వ్యూ
.
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 12.04.2019.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ : 03.05.2019.
* దరఖాస్తుల ఎడిట్‌కు చివరితేదీ : 03.05.2019.
* దరఖాస్తులు ప్రింట్ తీసుకోవడానికి చివరితేదీ : 18.05.2019.
* ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు ప్రక్రియ : 12.04.2019 – 03.05.2019.
* ప్రిలిమినరీ పరీక్ష : జూన్‌లో.
* మెయిన్ పరీక్ష : 10.08.2019.

నోటిఫికేషన్

ఆన్ లైన్ అప్లికేషన్

Read Also : టీడీపీదే విజయం, 130 స్థానాలు కైవసం : చంద్రబాబు జోస్యం