SSC MTS Result 2024 : ఎస్ఎస్‌సీ ఎంటీఎస్ 2024 ఫలితాలు త్వరలో విడుదల.. పూర్తి వివరాలను చెక్ చేయండి!
SSC MTS Result 2024 : రిక్రూట్‌మెంట్ పరీక్షలో హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (ssc.gov.in)ని విజిట్ చేయడం ద్వారా ఫలితాలను యాక్సెస్ చేయగలరు.

SSC MTS Result 2024 To Be Announced Soon
SSC MTS Result 2024 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) త్వరలో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS), హవల్దార్ పరీక్షల ఫలితాలను ప్రకటించనుంది. రిక్రూట్‌మెంట్ పరీక్షలో హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (ssc.gov.in)ని విజిట్ చేయడం ద్వారా ఫలితాలను యాక్సెస్ చేయగలరు. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వంటి వారి లాగిన్ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పరీక్ష సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 14 మధ్య జరిగింది.
ఎస్ఎస్‌సీ ఎంటీఎస్ ఫలితాలను డౌన్‌లోడ్ చేయాలంటే? :
- అధికారిక వెబ్‌సైట్ (ssc.gov.in) సందర్శించండి.
- హోమ్‌పేజీలో ఆన్సర్ కీ లింక్‌పై క్లిక్ చేయండి.
- ఎస్ఎస్‌సీ ఎంటీఎస్ రిజల్ట్స్ 2024 కోసం లింక్‌ని ఎంచుకోండి.
- మీ లాగిన్ వివరాలను జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఆపై సబ్మిట్ చేయండి.
- ఆ తరువాత, ఎస్ఎస్‌సీ ఎంటీఎస్ ఆన్సర్ కీ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
- ఆన్సర్ చెక్ చేయండి. అవసరమైతే అభ్యంతరాలను తెలపండి.
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కోసం 6,144, హవల్దార్ పోస్టులకు 3,439 సహా మొత్తం 9,583 ఖాళీలను భర్తీకి రిక్రూట్‌మెంట్ పరీక్ష నిర్వహిస్తారు.
ఎస్ఎస్‌సీ ఎంటీఎస్ రిక్రూట్‌మెంట్ 2024.. పరీక్షా విధానం :
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష రెండు సెషన్‌లలో జరుగుతుంది. సెషన్-I, సెషన్-II-ఒకే రోజున రెండూ తప్పనిసరి.
- సెషన్-I : అభ్యర్థులు పూర్తి చేయడానికి 45 నిమిషాల సమయం ఉంటుంది. 45 నిమిషాల తర్వాత సెషన్-I ఆటోమాటిక్‌గా క్లోజ్ కానుంది.
- సెషన్-II : ఈ సెషన్ సెషన్-I తర్వాత వెంటనే ప్రారంభమవుతుంది. 45 నిమిషాల పాటు కొనసాగుతుంది.
- సెషన్-1లో నెగెటివ్ మార్కింగ్ ఉండదు. అయితే, సెషన్-IIలో, ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.
ఎస్ఎస్‌సీ ఎంటీఎస్ రిక్రూట్‌మెంట్ 2024 :
- సీబీఎన్‌లో ఎంటీఎస్ హవల్దార్‌లకు వయో పరిమితి
- (రెవెన్యూ శాఖ) : అభ్యర్థులు 18ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
- సీబీఐసీ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ), నిర్దిష్ట ఎంటీఎస్ పోస్ట్‌లలో హవల్దార్ కోసం వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్య ఉంటుంది.
Read Also : Premchand Godha : ఈ బిలియనీర్ ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ సీఏ.. ఇప్పుడు రూ.21వేల కోట్ల కంపెనీకి అధిపతి..!