SSC JOB NOTIFICATION : 2065 పోస్టుల భర్తీ చేపట్టనున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి పోస్టును బట్టి టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

SSC JOB NOTIFICATION : 2065 పోస్టుల భర్తీ చేపట్టనున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్

Ssc

Updated On : May 13, 2022 / 3:58 PM IST

SSC JOB NOTIFICATION : న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్ ఎస్ సీ) కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు,విభాగాలు,సంస్థల్లోని వివిధ కేటగిరీల్లో ఫేజ్‌10కు సంబంధించి ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. ఆ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2065 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో నర్సింగ్‌ ఆఫీసర్‌, సీనియర్‌ రీసెర్చ్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, ఫార్మసిస్ట్, రీసెర్చ్‌ అసోసియేట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌, ల్యాబొరేటరీ అటెండెంట్‌, పర్సనల్ అసిస్టెంట్‌, సర్వేయర్‌, ఎంటీఎస్‌ తదితర ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి పోస్టును బట్టి టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక రాత పరీక్ష అధారంగా జరుగుతుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ జూన్‌ 13, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం https://ssc.nic.in/పరిశీలించగలరు.