TS ECET 2025 Counselling: టీఎస్ ఈసెట్ కౌన్సెలింగ్.. ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు.. అలాట్మెంట్ కార్డు డౌన్లోడ్, పూర్తి వివరాలు

TS ECET 2025 Counselling: తెలంగాణ రాష్ట్రంలో ఈసెట్‌ 2025 కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఫైనల్ ఫేజ్ సీట్లను కూడా కేటాయించారు అధికారులు.

TS ECET 2025 Counselling: టీఎస్ ఈసెట్ కౌన్సెలింగ్.. ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు.. అలాట్మెంట్ కార్డు డౌన్లోడ్, పూర్తి వివరాలు

Telangana ECET 2025 Second Phase Seat Allocation Completed

Updated On : July 20, 2025 / 2:17 PM IST

తెలంగాణ రాష్ట్రంలో ఈసెట్‌ 2025 కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం జరిగిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ ద్వారా సీట్ల కేటాయింపు జరగగా.. తాజాగా ఫైనల్ ఫేజ్ సీట్లను కూడా కేటాయించారు అధికారులు. ఫైనల్ ఫీజ్ లో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్ లో రిపోర్టింగ్ చేసుకోవాలి. దానికి ఈరోజే(జులై 20) చివరి తేదీ. అనంతరం జూలై 22లోపు సీటు పొందిన కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. లేదా కేటాయించిన సీటు రద్దు అవుతుంది. సీట్లు పొందిన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ https://tgecet.nic.in/ నుంచి అలాట్ మెంట్ ఆర్డర్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మీ అలాట్మెంట్ ఆర్డర్ కాపీని ఇలా పొందండి:

  • విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://tgecet.nic.in/ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలోని క్యాండెట్ లాగిన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే మీ అలాట్ మెంట్ కాపీ డిస్ ప్లే అవుతుంది.
  • దానిని ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

ఈ సంవత్సరం టీజీ ఈసెట్ ద్వారా ఇంజినీరింగ్‌లో 12,618 మంది, బీఫార్మసీలో 1,287 మంది జాయిన్ అయ్యారు. ఇంకా బీటెక్‌లో 2,489, బీఫార్మసీలో 1,230 సీట్లు మిగిలిపోయాయని అధికారులు తెలిపారు. ఈ మిగిలిపోయిన సీట్లకు గాను స్పాట్ అడ్మిషన్ల కోసం జులై 22వ తేదీన మార్గదర్శకాలు జారీ చేస్తారు. జూలై 29 లోపు సీట్ల అలాట్ మెంట్ ప్రక్రియ ముగుస్తుంది.