Telangana Inter Exams Dates: తెలంగాణ ఇంటర్ పరీక్షల డేట్స్ ఇవే?

ఫిబ్రవరిలోనే పరీక్షలు ప్రారంభిస్తే విద్యార్థులు ఎప్‌సెట్, జేఈఈ మెయిన్, నీట్‌కు ప్రిపేర్ కావడానికి సమయం దొరుకుతుందని ఇంటర్‌ బోర్డు అధికారులు భావిస్తున్నారు.

Telangana Inter Exams Dates: తెలంగాణ ఇంటర్ పరీక్షల డేట్స్ ఇవే?

Updated On : October 17, 2025 / 10:09 AM IST

Inter Exams: తెలంగాణలో ఇంటర్‌ వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే టైమ్‌ టేబుల్‌ను సర్కారుకు ఇంటర్‌బోర్డు ఆమోదం కోసం పంపింది.

త్వరలోనే ఇంటర్‌ పరీక్షల పూర్తి షెడ్యూల్​ను అధికారికంగా విడుదల చేస్తారు. ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి, ద్వితీయ సంవత్సర పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమవుతాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇంటర్ బోర్డు ప్రారంభించింది. (Inter Exams)

కాగా, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్ వచ్చింది. పరీక్షలు ఫిబ్రవరి 23న నుంచి మార్చి 24 వరకు జరగనున్నాయి. ఫిబ్రవరిలోనే పరీక్షలు ప్రారంభిస్తే విద్యార్థులు ఎప్‌సెట్, జేఈఈ మెయిన్, నీట్‌కు ప్రిపేర్ కావడానికి సమయం దొరుకుతుందని ఇంటర్‌ బోర్డు అధికారులు భావిస్తున్నారు.

గత సంవత్సరం మార్చి 5న ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కాగా, జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌ 2 నుంచి ప్రారంభమైంది. దీంతో గ్యాప్ తక్కువగా ఉండడంతో స్టూడెంట్స్‌ ఒత్తిడికి గురయ్యారు. తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలను 9 లక్షల మందికిపైగా రాస్తారు.

మరోవైపు, ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజును పెంచాలని సర్కారుకు తెలంగాణ ఇంటర్‌బోర్డు అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఇంటర్‌లో ప్రాక్టికల్ పరీక్షలు ఉండని కోర్సులకు రూ.520 ఫీజును ప్రస్తుతం తీసుకుంటున్నారు. ఎంపీసీ, బైపీసీ, జువాలజీ వంటి గ్రూపులు, ఒకేషనల్‌ కోర్సులకు రూ.750 ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంటే ఇకపై ప్రాక్టికల్స్‌ ఉండని కోర్సులకు రూ.600, ప్రాక్టికల్స్‌ ఉండే కోర్సులకు రూ.875 తీసుకునే ఛాన్స్ ఉంది.

Also Read: అందుకే భారత్‌ మానుంచి చమురు కొంటోంది: ట్రంప్‌కు గట్టిగా కౌంటర్‌ ఇచ్చిన రష్యా