ఇంకా ఫీజు కట్టలేదా? గుడ్‌న్యూస్.. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పెంపు
ఇంటర్ పరీక్షల ఫలితాలు ఈ నెల 22న విడుదలైన విషయం తెలిసిందే.

తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మే 1 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లించుకోవచ్చని ఇంటర్ బోర్డ్ తెలిపింది. అలాగే, కాలేజ్ లాగిన్‌లో రెండో తేదీ వరకు అవకాశం కల్పించింది.
ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థుల కోసం తెలంగాణ ఇంటర్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను మేలో నిర్వహిస్తారు. సప్లిమెంటరీ థియరీ పరీక్షలు రెండు సెషన్లలో మే 22 నుంచి జరుగుతాయి.
ఇక ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 3 నుంచి జూన్ 6 వరకు నిర్వహిస్తారు. విద్యార్థులు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజును ఏప్రిల్ 23 నుంచి 30 మధ్య వారి కాలేజీల్లో చెల్లించాలని మొదట విద్యాశాఖ ప్రకటన చేసింది. నేటితో గడువు ముగుస్తుండడంతో మరొక రోజు దీన్ని పొడిగించింది.
ఇంటర్ పరీక్షల ఫలితాలు ఈ నెల 22న విడుదలైన విషయం తెలిసిందే. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరాలకు విద్యార్థులు మొత్తం 9,97,012 మంది హాజరయ్యారు. ప్రథమ సంవత్సరం పాస్ పర్సంటేజ్ 66.89 గా, ద్వితీయ సంవత్సరం పాస్ పర్సంటేజ్ 71.37గా నమోదైంది.
మొదటి సంవత్సరం బాలికల పాస్ పర్సంటేజ్ 73.83, బాయ్స్ పాస్ పర్సంటేజ్ 57.83గా ఉంది. సెకండ్ ఇయర్ బాలికలు పాస్ పర్సంటేజ్ 74.21, సెకండ్ ఇయర్ బాయ్స్ పాస్ పర్సంటేజ్ 57.21గా నమోదైంది.