TS POLYCET 2025: తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే!
TS POLYCET 2025: తెలంగాణ పాలిసెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ వివరాలను వెల్లడించింది.

Telangana polycet 2025
తెలంగాణ పాలిసెట్ – 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ వివరాలను వెల్లడించింది. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియను 2 విడతల్లో పూర్తిచేయనున్నారు అధికారులు. ఇక ఈ ఏడాది జరిగిన పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్షకు మొత్తం 1,06,716 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 80,949 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొని సీట్లు పొందాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం నుండి కొత్తగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో 2 ప్రభుత్వ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి.
టీజీ పాలిసెట్ కౌన్సెలింగ్ ముఖ్యమైన తేదీలు:
- జూన్ 24 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ మొదలవుతుంది. జూన్ 28తో ఈ ప్రక్రియ ముగుస్తుంది.
- జూన్ 26 నుంచి 29 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.
- జూలై 1 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుంది.
- జులై 4న ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది.
- జూలై 4 నుంచి 6 వరకు ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి.
- సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే సీటు రద్దవుతుంది.
- ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ జూలై 9 నుంచి మొదలవుతుంది.
- జూలై 11 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.
- జూలై 11 నుంచి 12 వరకు వెబ్ అషన్లు నమోదు చేసుకోవాలి.
- జూలై 15న సీట్లు కేటాయింపు ఉంటుంది.
- జూలై 18 నుంచి ఫస్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి.
టీజీ పాలిసెట్ ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి:
- ముందుగా టీజీ పాలిసెట్ అధికారిక వెబ్ సైట్ https://www.polycet.sbtet.telangana.gov.in/ ఓపెన్ చేయాలి.
- హోం పేజీలో ర్యాంక్ కార్డుపై క్లిక్ చేయాలి.
- అక్కడ హాల్ టికెట్ నెంబర్, క్యాప్చాను నమోదు చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.
- ర్యాంక్ కార్డు స్క్రీన్‌పై డిస్ ప్లే అవుతుంది.
- డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీయూకోవాలి.
- అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా ముఖ్యం.