Govt Jobs : తెలంగాణ స్టేట్‌ వెటర్నరీ యూనివర్సిటీ టీచింగ్ ఫ్యాకల్టీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీతో పాటు నెట్‌,స్లెట్‌,సెట్‌ లేదా ఎంఫిల్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజుగా రూ.1,500 చెల్లించాలి.

Govt Jobs : తెలంగాణ స్టేట్‌ వెటర్నరీ యూనివర్సిటీ టీచింగ్ ఫ్యాకల్టీల భర్తీ

Veterinary University JOBS

Updated On : September 19, 2023 / 12:25 PM IST

Govt Jobs : పీవీ నరసింహారావు తెలంగాణ స్టేట్‌ వెటర్నరీ యూనివర్సిటీ హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోన టీచింగ్ ఫ్యాకల్టీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 84 అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్(వెటర్నరీ సైన్స్ ఫ్యాకల్టీ) 56 పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్(వెటర్నరీ సైన్స్ ఫ్యాకల్టీ) 28 పోస్టులు ఉన్నాయి.

READ ALSO : Sbi Recruitment :స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో పలు పోస్టుల భర్తీ

యానిమల్ జెనెటిక్స్ అండ్‌ బ్రీడింగ్, యానిమల్ న్యూట్రిషన్, లైవ్‌స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, లైవ్‌స్టాక్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ అనాటమీ, వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్, వెటర్నరీ బయోకెమిస్ట్రీ, వెటర్నరీ గైనకాలజీ అండ్‌ ఓబ్‌స్టేట్రిక్స్‌, వెటర్నరీ మెడిసిన్‌, వెటర్నరీ మైక్రోబయాలజీ, వెటర్నరీ పారాసైటాలజీ, వెటర్నరీ పాథాలజీ, వెటర్నరీ ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ, వెటర్నరీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎపిడెమియాలజీ, వెటర్నరీ సర్జరీ, రేడియాలజీ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

READ ALSO : Teen Depression : టీనేజర్లలో డిప్రెషన్.. కాస్త కనిపెట్టుకుని ఉండండి

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీతో పాటు నెట్‌,స్లెట్‌,సెట్‌ లేదా ఎంఫిల్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజుగా రూ.1,500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. అర్హతలున్నవారు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి నిర్ణీత గడువులోగా పంపాల్సి ఉంటుంది. అభ్యర్థులు సెప్టెంబరు 30, 2023లోగా దరఖాస్తులు సమర్పించాలి.

READ ALSO : Paddy Cultivation : ముదురు వరి నారు వేసేటప్పుడు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: రిజిస్ట్రార్, పి.వి. నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, రాజేంద్రనగర్, హైదరాబాద్-500 030 (TS). పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://tsvu.nic.in/ పరిశీలించగలరు.