Group 3 Result: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి..

తెలంగాణలోని 33 జిల్లాల్లోని 1,401 పరీక్షా కేంద్రాలలో జూనియర్ అసిస్టెంట్, ఎల్‌డీ స్టెనో, టైపిస్ట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్ష నిర్వహించింది.

Group 3 Result: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి..

Updated On : March 14, 2025 / 3:48 PM IST

తెలంగాణలో గత ఏడాది నవంబర్‌లో జరిగిన గ్రూప్‌ -3 ఫలితాలను అధికారులు ఇవాళ రిలీజ్ చేశారు. అభ్యర్థుల మార్కులు, జనరల్ ర్యాంకుల లిస్టు విడుదలైంది. అభ్యర్థులు పరీక్షకు సంబంధించిన తుది కీతో పాటు మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్లు, ఓఎంఆర్‌ షీట్లను కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

తెలంగాణలో 1,365 ఉద్యోగాల భర్తీ కోసం ఈ పరీక్షలు నిర్వహించగా 5,36,400 మంది అప్లై చేసుకున్నారు. గత ఏడాది నవంబర్‌ 17, 18 తేదీల్లో ఈ ఎగ్జామ్స్‌ జరిగాయి. 5,36,400 మంది అప్లై చేసుకుంటే వారిలో 50.24 % మంది మాత్రమే పరీక్షలు రాశారు. ఇప్పటికే తెలంగాణలో గ్రూప్‌- 1, గ్రూప్‌ -2 ఫలితాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

తెలంగాణలోని 33 జిల్లాల్లోని 1,401 పరీక్షా కేంద్రాలలో జూనియర్ అసిస్టెంట్, ఎల్‌డీ స్టెనో, టైపిస్ట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్ష నిర్వహించింది. ఇక హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన ఎగ్జామ్స్‌ ఫలితాలను ఈ నెల 17న ప్రకటిస్తారు.

గ్రూప్ 3 ఫలితాలు ఎలా చూసుకోవాలి

  • విద్యార్థులు కమిషన్ వెబ్‌సైట్ నుంచి ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
  • tspsc.gov.in ఓపెన్ చేయండి
  • “TSPSC గ్రూప్ 3 రిజల్ట్ 2025” లింక్‌పై క్లిక్ చేయండి
  • పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసి, మీ హాల్ టికెట్ నంబర్ చూసుకోండి
  • ప్రింట్ అవుట్ తీసుకోండి