SSC CGL 2025: దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్.. పూర్తి వివరాలు.. అప్లై ఇలా చేసుకోండి
SSC CGL 2025: SSC CGL 2025 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజుతో (జూలై 4) ముగియనుంది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ 2025 కోసం అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ssc.gov.in నుంచి అప్లై చేసుకోవచ్చు.

Today is the last date for SSC CGL 2025 Registration
SSC CGL 2025 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజుతో (జూలై 4) ముగియనుంది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ 2025 కోసం అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ssc.gov.in నుంచి అప్లై చేసుకోవచ్చు. ఈ మేరకు చెల్లింపులు జరిపేందుకు చివరితేదీ జులై 5గా నిర్ణయించారు. ఇక దరఖాస్తుల్లో మార్పులు ఉంటే సరిచేసుకోవడం అవసరమైన సేవలు జూలై 9న మొదలై జూలై 11తో ముగియనున్నాయి. ఇక SSC CGL టైర్ 1 పరీక్ష ఆగస్టు 13 నుంచి ఆగస్టు 30 వరకు జరుగనున్నాయి. SSC CGL పరీక్ష అనేది కమిషన్ యొక్క ప్రధాన పరీక్ష. ఇది గ్రూప్ B గెజిటెడ్, గ్రూప్ B నాన్-గెజిటెడ్, గ్రూప్ C పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తారు.
దరఖాస్తు ఇలా చేసుకోండి:
ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://ssc.gov.in/ లోకి వెళ్ళాలి.
హోమ్ పేజీలో లాగిన్ లింక్ పై క్లిక్ చేయాలి.
అక్కడ పేరు, పూర్తి వివరాలను ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
ఆ తర్వాత అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.
అక్కడ అప్లికేషన్ ఫామ్ నింపి ఫీజు చెల్లించాలి.
తరువాత సబ్మిట్పై పై క్లిక్ చేసి చేసి డౌన్లోడ్ చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.100. ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ కు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.