SI, కానిస్టేబుల్ రాత పరీక్షల తేదీలు ఖరారు..

  • Published By: veegamteam ,Published On : March 12, 2019 / 06:41 AM IST
SI, కానిస్టేబుల్ రాత పరీక్షల తేదీలు ఖరారు..

Updated On : March 12, 2019 / 6:41 AM IST

తెలంగాణలో SI, కానిస్టేబుల్ అభ్యర్థుల రాత పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 20 నుంచి మే 19 వరకు పోలీసు రాతపరీక్షలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది. రాష్ట్రంలో SI, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం ఫిజికల్ టెస్టులు ఇప్పటికే కొనసాగుతుండగా…ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు ఆయా తేదీల్లో రాత పరీక్షలకు హాజరు కానున్నారు.
– ఏప్రిల్ 20, 21 తేదీల్లో ఎస్సై(సివిల్) రాత పరీక్ష నిర్వహిస్తారు.
– ఏప్రిల్ 27న ఎస్సై (ఐటీ & కమ్యూనికేషన్), ఏఎస్‌ఐ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు.
– ఏప్రిల్ 28న కానిస్టేబుల్ (సివిల్, ఐటీ & కమ్యూనికేషన్) రాత పరీక్ష నిర్వహించనున్నారు.
– మే 19న కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకు, కానిస్టేబుల్ మెకానిక్ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. 

SI, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫిజికల్ ఈవెంట్లు ముగియగానే ఫైనల్ రాతపరీక్ష నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను కూడా సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

* వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..