TSPSC Group 4 Results : గ్రూపు 4 పరీక్ష ఫలితాలు విడుదల.. ఈ లింక్ ద్వారా చెక్ చేసుకోండి!

TSPSC Group 4 Results : గ్రూపు 4 పరీక్ష ప్రొవిజనల్ ఆప్షన్ జాబితా విడుదల అయింది. అభ్యర్థులు (tspsc.gov.in)లో అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేసి చెక్ చేసుకోవచ్చు.

TSPSC Group 4 Results : గ్రూపు 4 పరీక్ష ఫలితాలు విడుదల.. ఈ లింక్ ద్వారా చెక్ చేసుకోండి!

TSPSC Group 4 provisional selection list

Updated On : November 14, 2024 / 9:35 PM IST

TSPSC Group 4 Results : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ 4 అభ్యర్థుల కోసం ప్రొవిజనల్ ఆప్షన్ జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఈ గ్రూపు 4 పరీక్షకు హాజరైన అభ్యర్థులు, ప్రొవిజనల్ ఆప్షన్ జాబితాను చెక్ చేయాలనుకునే అభ్యర్థులు (tspsc.gov.in)లో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అధికారిక నోటీసు ప్రకారం.. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ప్రభుత్వ కార్యదర్శుల కమిటీ నుంచి స్పోర్ట్స్ మెరిట్ జాబితాను పొందుతారు. మొత్తం 8084 మంది అభ్యర్థులు ప్రొవిజనల్ ఆప్షన్ జాబితాను పొందవచ్చు.

గ్రూపు 4 రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మొత్తం 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూపు 4 పరీక్షలు జూలై 01, 2023న రెండు షిఫ్టుల్లో జరిగాయి. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 20/06/2024 నుంచి 31/08/2024 వరకు, 27/10/2024 నుంచి 28/10/2024, 04/11/2024 నుంచి 05/11/2024, 08/11/2024 వరకు, 09/11/2024 నుంచి 10/11/2024 వరకు జరిగింది.

అధికారిక నోటీసు ప్రకారం.. ప్రొవిజనల్ ఆప్షన్లు ఈ కింది షరతులకు లోబడి ఉంటాయి. పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థికి సంబంధించిన వివరాలను పరిగణనలోకి తీసుకుని గ్రూపు 4 నియామకానికి అపాయింట్‌మెంట్ అందిస్తారు. నియమాలు/నోటిఫికేషన్‌కు అనుగుణంగా అభ్యర్థి అలాంటి ఒరిజినల్ సర్టిఫికేట్‌లను తప్పనిసరిగా సమర్పించాలి. టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 ప్రొవిజనల్ ఆప్షన్ జాబితాను చెక్ చేసేందుకు అధికారిక వెబ్‌సైట్‌ (tspsc.gov.in)లో చెక్ చేసుకోవచ్చు.

Read Also : UPSC CMS Final Result : యూపీఎస్సీ సీఎంఎస్ ఫైనల్ రిజల్ట్స్ విడుదల.. ఈ లింక్ ద్వారా చెక్ చేసుకోండి