UGC NET 2025: యూజీసీ నెట్ అడ్మిట్​ కార్డులు విడుదల.. ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి

UGC NET 2025: యూజీసీ నెట్​ 2025 పరీక్షకు సంబంధించిన అడ్మిట్​ కార్డులను అధికారులు విడుదల చేశారు.

UGC NET 2025: యూజీసీ నెట్ అడ్మిట్​ కార్డులు విడుదల.. ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి

UGC NET 2025 Exam

Updated On : June 23, 2025 / 11:05 AM IST

యూజీసీ నెట్​ 2025 పరీక్షకు సంబంధించిన అడ్మిట్​ కార్డులను అధికారులు విడుదల చేశారు. జూన్​ 25న ఈ పరీక్ష జరుగనుంది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ సిటీ స్లిప్‌లను కూడా విడుదల చేసింది. ఈ సిటీ స్లిప్‌ లలో పరీక్షా కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే వివరాలు ఉంటాయి. ఇక అడ్మిట్ కార్డులో పరీక్షా కేంద్రాల పేరు, చిరునామాతో పాటు ముఖ్యమైన సమాచారం ఉంటుంది. ఇక ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.in నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

అడ్మిట్ కార్డును ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://ugcnetjun2025.ntaonline.in/admitcard/index లోకి వెళ్ళాలి

తరువాత అప్లికేషన్ నెంబర్లు, పుట్టిన తేదీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి

తరువాత అడ్మిట్ కార్డు డిస్ప్లే అవుతుంది, డౌన్లోడ్ చేసుకోవాలి.

యూజీసీ నెట్​ 2025 పరీక్ష ముఖ్యమైన సమాచారం:

యూజీసీ నెట్​ 2025 జాతీయ స్థాయి ఎంట్రెన్స్ టెస్ట్ జూన్ 25 నుంచి 29 వరకు జరుగుతుంది.

ఈ పరీక్ష రెండు షిఫ్టులలో ఉంటుంది.

మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి 12 వరకు జరుగుతుంది.

రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు జరుగుతుంది.