UP NEET PG Counselling : యూపీ నీట్ పీజీ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఇదే.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి..!
UP NEET PG Counselling 2024 : ఉత్తరప్రదేశ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG) కౌన్సెలింగ్ 2024 రిజిస్ట్రేషన్ విండో ఈరోజు (అక్టోబర్ 9న) ముగియనుంది. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి.

UP NEET PG Counselling 2024_ Registration Ends Today
UP NEET PG Counselling 2024 : డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (DGME), ఉత్తరప్రదేశ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG) కౌన్సెలింగ్ 2024 రిజిస్ట్రేషన్ విండో ఈరోజు (అక్టోబర్ 9న) ముగియనుంది. వివిధ మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ పొందాలనుకునే అర్హత గల అభ్యర్థులు యూపీ నీట్ పీజీ 2024 అధికారిక వెబ్‌సైట్ (upneet.gov.in)లో అప్లయ్ చేసుకోండి.
అంతకుముందు యూపీ నీట్ పీజీ 2024 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ సెప్టెంబర్ 30న క్లోజ్ కానుంది. అయితే, పలువురు విద్యార్థుల అభ్యర్థన తర్వాత డీజీఎంఈ అక్టోబర్ 7న (2 రోజుల పాటు) మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ విండోను అందుబాటులో ఉంచింది. ఆసక్తిగల అభ్యర్థులు ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
యూపీ నీట్ పీజీ 2024 దరఖాస్తు రుసుము :
అభ్యర్థులు రిజిస్ట్రేషన్ సమయంలో రిజిస్ట్రేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము రూ. 3వేలు. ప్రభుత్వ రంగంలోని మెడికల్ సీట్లకు (MD, MS, Diploma, DNB కోర్సులు) సెక్యూరిటీ డిపాజిట్ రూ. 30వేలు, ప్రైవేట్ రంగ మెడికల్ సీట్లకు (ఎండీ, ఎంఎస్ కోర్సులు) రూ. 2లక్షలు ఉంటుంది.
ప్రైవేట్ డెంటల్ కాలేజీలకు సెక్యూరిటీ మొత్తం రూ. లక్ష ఉంటుంది. డీజీఎమ్ఈ అన్ని రౌండ్లకు ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను ఓపెన్ అవుతుంది. గడువులోపు రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసిన విద్యార్థులు రౌండ్ 1, రౌండ్ 2, మాప్-అప్ రౌండ్, ఖాళీ రౌండ్‌లతో సహా అన్ని రౌండ్‌లకు అర్హులు.
యూపీ నీట్ పీజీ కౌన్సెలింగ్ 2024 కోసం ఎలా అప్లయ్ చేయాలంటే?
- అధికారిక వెబ్‌సైట్ (upneet.gov.in)ని విజిట్ చేయండి.
- హోమ్‌పేజీలో, రిజిస్ట్రేషన్ ట్యాబ్‌పై క్లిక్ చేసి పీజీని ఎంచుకోండి
- ఇప్పుడు, కోర్సును ఎంచుకుని, నీట్ పీజీ రోల్ నంబర్, ఇమెయిల్ ఐడీని ఎంటర్ చేయండి
- దరఖాస్తు ఫారమ్‌ను నింపండి. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించండి
- అన్ని వివరాలను సమర్పించిన తర్వాత అప్లికేషన్ ఫారమ్‌ను సేవ్ చేయండి
- కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసి, ప్రింటవుట్ తీసుకోండి