NEET PG Counselling 2024 : నీట్ పీజీ కౌన్సెలింగ్ 2024.. ఫస్ట్ రౌండ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం.. పూర్తి వివరాలివే..!

NEET PG Counselling 2024 : నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG) కౌన్సెలింగ్ మొదటి రౌండ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. పూర్తివివరాలను ఎంసీసీ వెబ్‌సైట్‌లో (mcc.nic.in)లో యాక్సెస్ చేయవచ్చు.

NEET PG Counselling 2024 : నీట్ పీజీ కౌన్సెలింగ్ 2024.. ఫస్ట్ రౌండ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం.. పూర్తి వివరాలివే..!

NEET PG Counselling 2024_ Registration For Round 1 Starts, Check Details

Updated On : September 20, 2024 / 11:51 PM IST

NEET PG Counselling 2024: మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG) కౌన్సెలింగ్ మొదటి రౌండ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అభ్యర్థులు అధికారిక ప్రకటన, వివరాలను ఎంసీసీ వెబ్‌సైట్‌లో (mcc.nic.in)లో యాక్సెస్ చేయవచ్చు. అభ్యర్థి దరఖాస్తు ఫారమ్‌ను ఒక్కసారి మాత్రమే సమర్పించేందుకు అనుమతిస్తారు.

ఒక అభ్యర్థి నీట్ పీజీ కౌన్సెలింగ్ కోసం మల్టీ అప్లికేషన్లు లేదా రిజిస్ట్రేషన్ ఫారమ్‌లను సమర్పించినట్లు గుర్తించి కేటాయింపు ప్రక్రియ నుంచి అనర్హులు అవుతారు. వారి అభ్యర్థిత్వం రద్దు అవుతుంది. డీజీహెచ్ఎస్, MoHFW మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) ఏదైనా అవసరమైన చర్య తీసుకుంటుంది.

Read Also : CBSE Admit Cards : సీబీఎస్ఈ కంపార్ట్‌మెంట్ పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల.. ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి!

ఇటీవలి అప్‌డేట్‌లలో, ఎంసీసీ రెండు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించింది. పీడబ్ల్యూడీ సర్టిఫికెట్‌ల జారీ, జాతీయత స్థితిని భారతీయుల నుంచి ఎన్ఆర్ఐకి మార్చే ప్రక్రియ. నీట్ పీజీ కౌన్సెలింగ్‌కు సంబంధించిన వివరణాత్మక షెడ్యూల్‌ను కమిటీ వెబ్‌సైట్‌లో త్వరలో పబ్లీష్ చేయనుంది. ఎంసీసీ మూడు ప్రధాన రౌండ్లలో నీట్ పీజీ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తుంది. ఏఐక్యూ రౌండ్ 1, ఏఐక్యూ రౌండ్ 2, ఏఐక్యూ రౌండ్ 3 తర్వాత మిగిలిన సీట్ల కోసం ఖాళీగా ఉండే రౌండ్‌లు ఉంటాయి.

కౌన్సెలింగ్ ప్రక్రియ దశలివే :
మెయిన్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ : అభ్యర్థులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇందులో నాన్-రీఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజు, రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ పేమెంట్ ఉంటుంది.

ఛాయిస్ ఫిల్లింగ్, లాకింగ్ : పాల్గొనేవారు అందుబాటులో ఉన్న సీట్ల కోసం వారి ఆప్షన్లను లాక్ చేస్తారు.

సీట్ల కేటాయింపు ప్రక్రియ : కమిటీ రౌండ్ 1 కోసం సీట్ల కేటాయింపును నిర్వహిస్తుంది.

ఫలితాల వెల్లడి : రౌండ్ 1 ఫలితాలు ఎంసీసీ వెబ్‌సైట్‌లో పబ్లీష్ చేయనున్నారు. సీట్లు కేటాయించిన అభ్యర్థులు తప్పనిసరిగా ఎంసీసీ సైట్‌లో అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.

ఫిజికల్ రిపోర్టింగ్ : అభ్యర్థులు తప్పనిసరిగా అసలు డాక్యుమెంట్లతో కేటాయించిన మెడికల్ లేదా డెంటల్ కాలేజీకి రిపోర్ట్ చేయాలి.

ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ : రౌండ్ 1లో సీటు కేటాయించిన అభ్యర్థులు స్వేచ్ఛగా నిష్క్రమించడాన్ని ఎంచుకోవచ్చు. రౌండ్ 2లో నేరుగా పాల్గొనవచ్చు.

అప్‌గ్రేడ్ అవకాశం : రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి అప్‌గ్రేడ్ చేయాలనుకునే అభ్యర్థులు ముందుగా తమకు కేటాయించిన కాలేజీకి రిపోర్ట్ చేసి, అడ్మిషన్ ఫార్మాలిటీలను పూర్తి చేయాలి. వారు ఈ ప్రక్రియలో అప్‌గ్రేడ్ చేసేందుకు తమ సుముఖతను తప్పనిసరిగా సూచించాలి.

రౌండ్ 2లో డైరెక్ట్ పార్టిసిపేషన్ : రౌండ్ 1లో సీటు పొందని అభ్యర్థులు మళ్లీ రిజిస్టర్ చేసుకోనవసరం లేకుండా రౌండ్ 2లో పాల్గొనవచ్చు.

అప్‌గ్రేడ్ చేయాలనుకునే అభ్యర్థులు, రౌండ్ 1 నుంచి అసలైన డాక్యుమెంట్లతో నియమించిన ఇన్‌స్టిట్యూట్‌కి రిపోర్టు చేయడం, అడ్మిషన్ అవసరాలను పూర్తి చేయడం చాలా అవసరం. కౌన్సెలింగ్ షెడ్యూల్‌కు సంబంధించి నెక్స్ట్ ప్రకటనల కోసం అప్‌డేట్‌గా ఉండాలని రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులందరికీ ఎంసీసీ సూచించింది.

Read Also : CBSE Board Exams 2025 : సీబీఎస్ఈ పరీక్షకు అభ్యర్థుల రిజిస్ట్రేషన్‌కు లాస్ట్ డేట్ ఇదే.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!