అప్లై చేసుకోండి: పలు విభాగాల్లో జాబ్‌లు ప్రకటించిన UPSC

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC CDS -2020) ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీతో పాటు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో గల అకాడమీల్లో మొత్తం 418 పోస్టుల్ని భర్తీ చేసింది. ఈ పరీక్షలో అర్హత సాధించినవారిని డిఫెన్స్‌లోని ఎయిర్‌ఫోర్స్, నేవీ, మిలిటరీ ఫోర్స్‌లో తీసుకుంటారు.
విభాగాల వారీగా ఖాళీలు:
ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రడూన్-100
ఇండియన్ నావల్ అకాడమీ, ఎజిమల-45
ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్-32
ట్రైనింగ్ అకాడమీ, చెన్నై- 225+16 (మహిళలు)
మొత్తం ఖాళీలు: 418.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్ధులు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, మహిళా అభ్యర్ధులకు మాత్రం ఎటువంటి ఫీజు లేదు.
విద్యార్హత:
అభ్యర్ధులు IMA, ఆఫీసర్స్ ట్రైనింగ్ కోసం గుర్తింపు కలిగిన యూనివర్సిటి నుంచి డిగ్రీ పాస్ అవ్వాలి. ఇండియన్ నావల్ అకాడమీ కోసం ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. ఎయిర్ ఫోర్స్ అకాడమీ కోసం 10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథ్స్‌తో పాటు డిగ్రీ పాస్ కావాలి. లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
ముఖ్యమైన తేదిలు:
> దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 30, 2019.
> దరఖాస్తు చివరితేది: నవంబర్ 19, 2019.
> కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్: ఫిబ్రవరి 2, 2020.
Read Also: సూర్యపేట GMCలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు