BDL Recruitment : భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో పోస్టుల భర్తీ

భర్తీ చేయనున్న పోస్టుల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్,ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిప్లొమా, సీఏ,ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.

BDL Recruitment : భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో పోస్టుల భర్తీ

BDL Recruitment

Updated On : May 22, 2023 / 9:37 AM IST

BDL Recruitment : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. హైదబాబాద్, బెంగళూరు, భానూర్,విశాఖపట్నం, కొచ్చి, ముంబయిలలో కార్యాలయాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

READ ALSO : Control Blood Sugar Levels : రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి తోడ్పడే పానీయాలు !

ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో హెచ్ఆర్, బిజినెస్ డెవలప్‌మెంట్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్ విభాగాల్లో పోస్టులను భర్తీ చేపట్టనున్నారు.

READ ALSO : Sesame Cultivation : నువ్వుసాగులో యాజమాన్యం

భర్తీ చేయనున్న పోస్టుల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్,ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిప్లొమా, సీఏ,ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించరాదు.

READ ALSO : Low Fat vs Low Carb : తక్కువ కొవ్వు vs తక్కువ కార్బ్.. ఈ రెండింటిలో ఏది ఆరోగ్యకరమైనది?

అభ్యర్థులను విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 30,000 నుంచి రూ. 39,000 వరకు జీతం చెల్లిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://bdl-india.in/ పరిశీలించగలరు.