Nise Recruitment : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రికల్ , ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ , ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ , మెకానికల్ , రెన్యూవబుల్ ఎనర్జీ తదితర విభాగాల్లో బీఈ, బీటెక్, ఎంఎస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

Institute of Solar Energy
Nise Recruitment : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన గురుగ్రామ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (ఎన్‌ఐఎస్‌ఈ) లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీలలో సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Mixed Farming : రైతుకు భరోసానిస్తున్న మిశ్రమ వ్యవసాయం.. పలు పంటల సాగు విధానంతో స్థిరమైన ఆర్థిక వృద్ధి
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రికల్ , ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ , ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ , మెకానికల్ , రెన్యూవబుల్ ఎనర్జీ తదితర విభాగాల్లో బీఈ, బీటెక్, ఎంఎస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల పోస్టును బట్టి 3 నుంచి ఆరేళ్ల అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
READ ALSO : Sorghum Crop Cultivation : కందిపంటకు నష్టం కలిగించే కాయతొలుచు పురుగులు, నివారణ చర్యలు!
దరఖాస్తు రుసుము రూ.1000/ చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్.సి, ఎస్టి, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము మినహాయింపువర్తిస్తుంది. అభ్యర్ధుల ఎంపిక రాతపరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ అధారంగా జరుగుతుంది. నెలకు రూ.53,000ల నుంచి రూ.70,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదిగా ఏప్రిల్ 20, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://nise.res.in/ పరిశీలించగలరు.