SBI Recruitment :స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగ ఖాళీల భర్తీ

అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 76,101 నుంచి రూ. 89,890 వరకు చెల్లిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

SBI Recruitment :స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగ ఖాళీల భర్తీ

Vacancies in State Bank of India

Updated On : June 12, 2023 / 7:13 AM IST

SBI Recruitment : భారత ప్రభుత్వ రంగ సంస్థ స్టేబ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో పలు ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 18 అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌, ఛీఫ్‌ మేనేజర్‌ మార్కెటింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

READ ALSO : బ్రెయిన్‌ ట్యూమర్‌‌ ఎందుకు వస్తుంది?

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్, ఎంబీఏ,పీజీడీబీఎం (మార్కెటింగ్/ఫైనాన్స్) ఉత్తీర్ణత ఉండాలి. దీంతోపాటుగా సంబంధిత విభాగంలో కనీసం 10 నుంచి 12 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 30 నుంచి 45 ఏళ్ల లోపు ఉండాలి.

READ ALSO : Banana Cultivation : వేసవిలో అరటి తోటల సంరక్షణ

అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 76,101 నుంచి రూ. 89,890 వరకు చెల్లిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు జూన్‌ 21, 2023ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://sbi.co.in/ పరిశీలించగలరు.