BDL Recruitment : భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. SC,ST,PWBD,మాజీ సైనికులు,అంతర్గత శాశ్వత ఉద్యోగులు దరఖాస్తు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. అభ్యర్థులు SBI ఇ-పే కార్డ్,క్రెడిట్ కార్డ్,నెట్ బ్యాంకింగ్,UPI మొదలైన వాటి ద్వారా ఫీజు చెల్లించవచ్చు.

BDL Recruitment
BDL Recruitment : భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 45 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ , వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Burn Belly Fat : ఈ డ్రింక్స్ తో పొట్ట చుట్టూ కొవ్వు మటుమాయం!
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి అభ్యర్థులు ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ (లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు) ఉత్తీర్ణులై ఉండాలి. ఇంజనీరింగ్ లేదా ఫస్ట్ క్లాస్ M.Sc/ 2 సంవత్సరాల MBA/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఆర్ట్స్, సైన్స్/ కామర్స్ ఇన్ లా లో ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.మేనేజ్‌మెంట్ ట్రైనీ, వెల్ఫేర్ ఆఫీసర్, JM (పబ్లిక్ రిలేషన్స్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు, వారు దరఖాస్తు చేస్తున్న పోస్ట్‌ను బట్టి గరిష్ట వయోపరిమితి 27/28 సంవత్సరాలు ఉండాలి.
READ ALSO : Hair Health : జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించే ఆరోగ్యకరమైన ఆహారాలు ఇవే !
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. SC,ST,PWBD,మాజీ సైనికులు,అంతర్గత శాశ్వత ఉద్యోగులు దరఖాస్తు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. అభ్యర్థులు SBI ఇ-పే కార్డ్,క్రెడిట్ కార్డ్,నెట్ బ్యాంకింగ్,UPI మొదలైన వాటి ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 20వ తేదీన దరఖాస్తుల ప్రక్రియకు చివరి గడువుగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; bdl-india.in పరిశీలించగలరు.