DMHO Recruitment : విజయనగరం వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా ఇంటర్, డిగ్రీ, డీఎంఎల్‌టీ, సర్టిఫికెట్ కోర్సు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఎంపికైన ల్యాబ్ టెక్నీషియన్‌లకు నెలకు రూ. 19,019, మిగిలిన పోస్టులకు నెలకు రూ. 33,975 చెల్లిస్తారు.

(c)James Wheeler james@souvenirpixels.com
DMHO Recruitment :విజయనగరంలోని వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా క్షయ నియంత్రణ కార్యాలయములో ల్యాట్ టెక్నీషియన్, సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్ వైజర్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్ వైజర్ ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 07 ఖాళీలను భర్తీ చేయనున్నారు.భర్తీ చేయనున్న ఖాళీల్లో సీనియర్ ట్రీట్‌మెంట్ సూపర్‌వైజర్ (01), సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్‌వైజర్ (02), ల్యాబ్ టెక్నీషియన్ (04) ఖాళీలు ఉన్నాయి.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా ఇంటర్, డిగ్రీ, డీఎంఎల్‌టీ, సర్టిఫికెట్ కోర్సు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఎంపికైన ల్యాబ్ టెక్నీషియన్‌లకు నెలకు రూ. 19,019, మిగిలిన పోస్టులకు నెలకు రూ. 33,975 చెల్లిస్తారు. అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను జిల్లా క్షయ నియంత్రణ అధికారి కార్యాలయం. విజయనగరం చిరునామాకు పంపించాలి. దరఖాస్తుల స్వీకరణ తుదిగడువు 17-11-2022గా నిర్ణయించారు.