Vcbl Recruitment : విశాఖపట్నం కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

ఆన్‌లైన్ రాత పరీక్ష ప్రిలిమ్స్‌, మెయిన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.45,590ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 14, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

Vcbl Recruitment : విశాఖపట్నం కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

Visakhapatnam Co Operative Bank Limited Job Vacancies

Updated On : November 10, 2022 / 2:22 PM IST

Vcbl Recruitment : ఆంధ్రప్రదేశ్‌ లోని విశాఖపట్నం కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 ప్రొబేషనరీ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్ ఐటీ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అర్హుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 20 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆన్‌లైన్ రాత పరీక్ష ప్రిలిమ్స్‌, మెయిన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.45,590ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 14, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 14వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.vcbl.in/ పరిశీలించగలరు.