Courses After Inter : ఇంటర్ తర్వాత మంచి ఫ్యూచర్ ఉన్న కోర్సులు ఏమిటి..? ఏ కోర్సు చేస్తే ఎలాంటి ఉద్యోగం చేయొచ్చు.. ఇక్కడ తెలుసుకోండి..
Courses After Inter : ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో పాస్ అయిన విద్యార్థులు తరువాత ఏం చేయాలి..? ఏ కోర్సులో చేరాలి..? ఏ కోర్సులో చేరితే ప్యూచర్లో బాగుంటుంది.. త్వరలో ఉద్యోగ పరంగా సెటిల్ కావాలంటే ఏ కోర్సులు చేయాలనే విషయాలపై దృష్టి సారిస్తుంటారు.
Courses After Inter
Courses After Inter : తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ మొదటి సంవత్సరంలో 66.20శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 70.58శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు 78.65 శాతం, బాలురు 62.50శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో పాస్ అయిన విద్యార్థులు తరువాత ఏం చేయాలి..? ఏ కోర్సులో చేరాలి..? ఏ కోర్సులో చేరితే ప్యూచర్లో బాగుంటుంది.. త్వరగా ఉద్యోగ పరంగా సెటిల్ కావాలంటే ఏ కోర్సులు చేయాలనే విషయాలపై దృష్టి సారిస్తుంటారు.
Also Read : TS Inter Results 2026 : ఇంటర్లో ఫెయిలైన వారికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎప్పుడు.. ఫీజు ఎప్పుడు కట్టాలంటే?
వీటిని ఎంచుకోవచ్చు..
♦ ఎక్కువ మంది విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్ వైపు మొగ్గు చూపుతున్నా.. నేటి కృత్రిమ మేథ కాలంలో (ఏఐ) ప్రతి గ్రూప్ విద్యార్థులకూ విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ.. ఇలా ఏ గ్రూప్ చదివినా.. ఆసక్తి, అప్టిట్యూడ్ ఆధారంగా కోర్సు ఎంచుకుంటే భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని విద్యా నిపుణులు పేర్కొంటున్నారు.
♦ ఇంటర్ పూర్తయిన విద్యార్థుల్లో కంప్యూటర్, యాప్ లేదా టెక్నాలజీల్లో ఆసక్తి కలిగి ఉంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఉత్తమమైనది. ఇందులో కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాప్ట్వేర్ డెవలప్మెంట్ నేర్పిస్తారు. ఈ కోర్సు తరువాత మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదంటే డేటా సైంటిస్ట్ అవ్వవచ్చు. మంచి వేతనం కూడా లభిస్తుంది.
♦ ఇంటర్ పూర్తయిన విద్యార్థుల్లో ఎక్కువ మందికి మిషన్స్ ఆటో మొబైల్స్‌లో ఆసక్తి ఉంటుంది. అలాంటి విద్యార్థులకు బీటెక్ (మెకానికల్ ఇంజనీరింగ్) మంచిగా సూటవుతుంది. ఇందులో మిషన్స్ తయారీ, ఉత్పత్తి, సాంకేతిక పని నేర్పిస్తారు. ఈ కోర్సు తరువాత ఆటోమొబైల్, తయారీ రగంలో ఉద్యోగాలు పొందొచ్చు. ఇందులోనూ మంచి వేతనాలు పొందొచ్చు.
♦ వ్యాపారంలో ఆసక్తి ఉన్న విద్యార్థులకు బీబీఏ (బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) మంచి ఎంపిక. మార్కెటింగ్, ఫైనాన్స్, వ్యాపార నైపుణ్యాలు నేర్పిస్తారు. భవిష్యత్తులో ఎంబీఏ చేయడం ద్వారా ఉన్నత స్థాయిల్లో ఉద్యోగం సాధించొచ్చు. మంచి లైఫ్ ను లీడ్ చేయొచ్చు.
♦ ఐటీ రంగంలోకి వెళ్లాలి.. కానీ, ఇంజనీరింగ్ చేయకూడదనుకుంటే బీసీఏ (బ్యాచిలర్ ఆప్ కంప్యూటర్ అప్టికేషన్స్) ఒక మంచి ఎంపిక. ఇందులో ప్రోగ్రామింగ్, వెబ్ డెవలప్మెంట్ నేర్పిస్తారు. దీని తరువాత మీరు సాఫ్ట్వేర్ లేదా యాప్ డెవలపర్ కావొచ్చు.
♦ విమానం, అంతరిక్ష సాంకేతికతతో పని చేయాలని భావించే విద్యార్థులకు BTech (ఏరోస్పేస్ ఇంజనీరింగ్) ఎంచుకోవచ్చు. ఇందులో మంచిగా రాణించడం ద్వారా మీరు అంతర్జాతీయ స్థాయిలో విమానాలు, రాకెట్ లకు సంబంధించిన విభాగాల్లో పనిచేయొచ్చు.
♦ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మొబైల్ నెట్వర్క్, ఎలక్ట్రానిక్ పరికరాలు ఎలా పనిచేస్తాయో నేర్పుతుంది. 5జీ, కొత్త సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు నిరంతరం పెరుగుతున్నాయి.
చాలామంది స్టూడెంట్స్ ఏదో హడావిడిగా, పక్కవాళ్లను చూసి తమ కెరీర్ నిర్ణయాన్ని తీసుకుంటారు. సరిగ్గా అక్కడే సరిదిద్దుకోలేని పొరపాటు జరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు తీసుకోబోయే నిర్ణయమే మీ జీవితం ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది.
అయితే, ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు జాబ్ మార్కెట్ ట్రెండ్స్ కంటే.. ఆసక్తి, ఆప్టిట్యూడ్, అభ్యసన సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకొని కోర్సును ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
