Winter Holidays Extended : పెరిగిన చలిగాలుల తీవ్రత.. స్కూళ్లకు శీతాకాల సెలవులు పొడిగింపు..!
Winter Holidays Extended : దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు కమ్ముకోవడంతో ఢిల్లీలో ఉదయం 5.30 గంటలకు కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది.

Winter Holidays Extended
Winter Holidays Extended : దేశ రాజధాని ఢిల్లీలో చలిగాలుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతుంది. అనేక జిల్లాలు, రాష్ట్రాలు ఉష్ణోగ్రతల, తీవ్రమైన చలిగాలుల మధ్య కొన్నిచోట్ల స్కూళ్లను మూసివేస్తూ శీతాకాల సెలవులను పొడిగించినట్లు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి.
దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు కమ్ముకోవడంతో ఢిల్లీలో ఉదయం 5.30 గంటలకు కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఎముకలు కొరికే చలి కారణంగా అధికారులు స్కూళ్లను మూసివేసిన ప్రాంతాల జాబితాను ఓసారి లుక్కేయండి.
పొగమంచు ఢిల్లీ-ఎన్‌సీఆర్ కమ్మేయడంతో పాఠశాలలు మూతపడ్డాయి. ఢిల్లీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు జనవరి 1 నుంచి జనవరి 15, 2025 వరకు శీతాకాల సెలవులను ప్రకటించింది. అధికారిక ఉత్తర్వుల ప్రకారం.. జనవరి 16, 2025న తరగతులు పునఃప్రారంభమవుతాయి. నోయిడాలోని అన్ని పాఠశాలలు తదుపరి నోటీసు వచ్చేవరకు 8వ తరగతి వరకు మూతపడనున్నాయి. ఘజియాబాద్ పాఠశాలలు జనవరి 11 వరకు మూతపడనున్నాయి.
హర్యానా పాఠశాలల్లో శీతాకాల విరామం :
లక్నో స్కూళ్లను జనవరి 11 వరకు మూసివేసింది. 9వ తరగతి నుంచి 12 తరగతులకు ఆన్‌లైన్ సెషన్‌లను నిర్వహించాలని పాఠశాలలను ఆదేశించింది. జనవరి 15 వరకు హర్యానా పాఠశాలల్లో శీతాకాల సెలవులు ప్రకటించింది. జనవరి 16, 2025న తరగతులు పునఃప్రారంభం కానున్నాయి.
తీవ్రమైన చలిగాలుల మధ్య బీహార్, జార్ఖండ్‌లో పాఠశాలలు మూతపడ్డాయి. బీహార్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు జనవరి 11, 2025 వరకు శీతాకాల సెలవులను ప్రకటించింది. తీవ్రమైన చలిగాలుల కారణంగా, బీహార్‌లోని అరారియా జిల్లాలో 8వ తరగతి వరకు తరగతులు జనవరి 12 వరకు మూతపడనున్నాయి.
అయితే, తరగతుల్లోని విద్యార్థులకు తరగతులు 9 నుంచి 12 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 వరకు కొనసాగుతాయి. ప్రీ-బోర్డ్, బోర్డ్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, పరీక్షలు ఇలా కొనసాగుతాయని గమనించడం ముఖ్యం. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల మధ్య జార్ఖండ్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు జనవరి 7 నుంచి జనవరి 11, 2025 వరకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
చండీగఢ్ స్కూళ్లకు శీతాకాల సెలవుల పొడిగింపు :
చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంలోని పాఠశాలకు శీతాకాల సెలవులను జనవరి 11, 2025 వరకు పొడిగించింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు జనవరి 11 వరకు మూతపడనున్నాయి. జనవరి 13, 2025న తిరిగి తెరుచుకోనున్నాయి.
తమిళనాడు, తెలంగాణలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులు :
పొంగల్‌ను పురస్కరించుకుని తమిళనాడు ప్రభుత్వం జనవరి 11 నుంచి జనవరి 19, 2025 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. అదేవిధంగా, తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. జనవరి 11 నుంచి జనవరి 17 వరకు తరగతులు నిలిపివేసింది. తెలంగాణలోని ఇంటర్మీడియట్ కాలేజీల్లో సంక్రాంతి సెలవులు జనవరి 16 వరకు ఉంటాయి.
పంజాబ్‌లో తరగతులు పునఃప్రారంభం :
పంజాబ్‌లో శీతాకాల సెలవులు ముగిశాయి. జనవరి 8, 2025న పాఠశాల తిరిగి తెరుచుకున్నాయి. సెలవుల పొడిగింపు లేదా పాఠశాల మూసివేతపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.
Read Also : OnePlus 13 First Sale : వన్‌ప్లస్ 13 ఫస్ట్ సేల్ మొదలైంది.. భారత్‌లో ఈ ఫోన్ ధర ఎంతంటే?