WDCW Recruitment : యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో పలు పోస్టుల భర్తీ
షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక జరుగుతుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.15,600ల నుంచి రూ.28,000ల వరకు జీతం చెల్లిస్తారు. అర్హతలున్న అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో జూన్ 17, 2022వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

WDCW Recruitment
WDCW Recruitment : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా శిశు దివ్యాంగుల, వయోవృధ్ధుల సంక్షేమ శాఖలో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పాజెక్టు కో ఆర్డినేటర్, కౌన్సిలర్, చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్ వైజర్, కేస్ వర్కర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Diabetic Nephropathy : డయాబెటిస్ ఉన్నవారు కిడ్నీ సమస్యలను ఎదుర్కోవటం ఎలాగంటే ?
ప్రాజెక్టు కోఆర్డినేటర్ పోస్టులకు సంబంధించి సోషల్ వర్క్ స్పెషలైజేషన్‌లో పీజీ, డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి. కౌన్సిలర్ పోస్టులకుగాను సోషల్ వర్క్‌లో గ్రాడ్యుయేషన్, పీజీ, డిప్లొమాలో ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలి. చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్‌వైజర్ పోస్టులకు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం ఏడాది అనుభవం ఉండాలి. కేస్ వర్కర్ పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 21 నుంచి 35 సంవత్సరాలలోపు ఉండాలి.
READ ALSO : Bypass Surgery : బైపాస్ సర్జరీ ఎప్పుడు అవసరం? తీవ్రమైన ఛాతీ నొప్పి ఉన్నవారందరికి ఇది అవసరమా ?
షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక జరుగుతుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.15,600ల నుంచి రూ.28,000ల వరకు జీతం చెల్లిస్తారు. అర్హతలున్న అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో జూన్ 17, 2022వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; జిల్లా సంక్షేమశాఖ, బ్లాక్ నం: జీ-01, జిల్లా కలెక్టర్ కార్యాలయం, రాయగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://yadadri.telangana.gov.in/