Assembly Elections 2023: ఢిల్లీ నేతలు నై.. కాంగ్రెస్ పార్టీకి అన్నే తానే అంటున్న సీఎం అశోక్ గెహ్లాట్
ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని చూస్తుంటే రాజస్థాన్ ఎన్నికలను గెహ్లాట్‌కు హైకమాండ్ పూర్తిగా వదిలేసినట్లు కనిపిస్తోంది. టిక్కెట్ల పంపిణీలో కూడా గెహ్లాట్ తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు.

Assembly Elections 2023: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు నెలకొంది. బీజేపీ నుంచి చాలా మందే స్టార్ క్యాంపెయినర్లు ఉన్నప్పటికీ.. పార్టీనే ప్రధాన ముఖంగా కాషాయ పార్టీ ముందుకు సాగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన ముఖాన్నే ముందంజలో ఉంచుతున్నరు. ఒక రకంగా చెప్పాలంటే.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తన ముఖంతోనే ప్రచారంలో ఉంచుతున్నారు గెహ్లాట్. చాలా పెద్ద హామీలు ఇస్తున్నారు. ఢిల్లీ పెద్దలు ఉన్నప్పటికీ, తానే కీలక ప్రకటనలు చేస్తున్నారు. ప్రియాంక గాంధీ సమావేశంలో కూడా గెహ్లాట్ రెండు పెద్ద హామీలు ఇచ్చారు. దీని తర్వాత ఆయన ఐదు హామీలను కూడా ప్రకటించారు. రాష్ట్రంలో ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత, ప్రియాంక గాంధీ ఇక్కడ రెండు ప్రధాన పర్యటనలు చేశారు. కానీ రాహుల్ గాంధీ ఇంకా రాజస్థాన్ వైపు వెళ్లలేదు.
ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని చూస్తుంటే రాజస్థాన్ ఎన్నికలను గెహ్లాట్‌కు హైకమాండ్ పూర్తిగా వదిలేసినట్లు కనిపిస్తోంది. టిక్కెట్ల పంపిణీలో కూడా గెహ్లాట్ తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. పార్టీలో తన మద్దతుదారులకు టిక్కెట్లు ఇస్తున్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు, బీజేపీ రెబల్స్‌ను కూడా పార్టీలోకి తీసుకుని టిక్కెట్లు ఇచ్చారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో గెహ్లాట్ ఏది కోరుకున్నారో అదే అక్కడ జరుగుతోందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. కేబినెట్ మంత్రి మహేశ్ జోషి, శాంతి ధరివాల్‌ల టికెట్ల జాప్యంపై వస్తున్న ఊహాగానాలకు సంబంధించి ఈ ఇద్దరు నేతలకు కూడా టిక్కెట్లు దక్కడం ఖాయమని వర్గాలు చెబుతున్నాయి.