Assembly Elections 2023: తుపాకీతో జవాబు ఇస్తా.. ఎన్నికల ర్యాలీలో బీజేపీ అభ్యర్థి వివాదాస్పద వ్యాఖ్యలు
గురువారం విడుదల చేసిన మూడో జాబితాలో పార్టీ నౌక్షం చౌదరిని కామన్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. కమాన్‌లో ఉన్న గుర్జర్ ఆశ్రమం సమీపంలో జరిగిన ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది

Nauksham Chaudhary: బుల్లెట్‌కు బ్యాలెట్‌తో సమాధానం ఇవ్వాలని అప్పుడెప్పుడో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. కానీ ఆయనకు పార్టీకి చెందిన నేత మాత్రం బుల్లెట్ తోనే సమాధానం ఇస్తానంటున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్‌పూర్ కు చెందిన ఒక నేత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనపై రాయి విసిరితే తుపాకీతో సమాధానం ఇస్తానని ఆమె అన్నారు. దీంతో ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
కమాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన బీజేపీ అభ్యర్థి నౌక్షం చౌదరి చేసిన వివాదాస్పద ప్రకటన రాజకీయంగా కలకలం రేపింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఎవరైనా తనపై రాయి విసిరితే తిరిగి రాయితో బదులిస్తానని, తనకు తూటాలు పేల్చడం కూడా తెలుసుని అన్నారు. నవంబర్ 3న సోషల్ మీడియాలో వీడియో షేర్ అయింది. అదిప్పుడు వైరల్ అవుతోంది. నెటిజెన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
“हमें जूते से इलेक्शन लड़ना आता है. किसी ने ईंट चलाया तो पत्थर से जवाब दूंगी”
◆ राजस्थान के कामां में बीजेपी प्रत्याशी नौक्षम चौधरी के विवादित बोल#RajasthanElections #Rajasthan | Nauksham Chaudhary BJP pic.twitter.com/3tDGyTrBKH
— News24 (@news24tvchannel) November 4, 2023
గురువారం విడుదల చేసిన మూడో జాబితాలో పార్టీ నౌక్షం చౌదరిని కామన్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. కమాన్‌లో ఉన్న గుర్జర్ ఆశ్రమం సమీపంలో జరిగిన ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అయితే పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తన వీడియోను ఎవరో ఎడిట్ చేశారని నౌక్షమ్ చౌదరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గత 5 సంవత్సరాలుగా కమాన్ అసెంబ్లీలో జరుగుతున్న జంగిల్ రాజ్, నియంతృత్వం గురించి తాను మాట్లాడానని, ఈ వీడియోను తప్పుగా షేర్ చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే వీడియోలో ఎలా షూట్ చేయాలో తనకు తెలుసని, ప్రతిదీ ఉపయోగకరంగా ఉందని అన్నారు. బూట్లతో ఎన్నికల్లో ఎలా పోరాడాలో తనకు తెలుసని, ఈ రోజు దేవాలయం నుంచే ఈ ప్రకటన చేస్తున్నానని అన్నారు.