Karnataka Elections 2023: ఏ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలో నిర్ణయం తీసుకున్నాం: జేడీఎస్

Karnataka Elections 2023: కర్ణాటకలో హంగ్ ఏర్పడితే కాంగ్రెస్, బీజేపీ కలిసే అవకాశాలు ఉండవు కాబట్టి, ఆ రెండు పార్టీల్లో ఏదైనా ఓ పార్టీ జేడీఎస్ తోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

Karnataka Elections 2023: ఏ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలో నిర్ణయం తీసుకున్నాం: జేడీఎస్

Karnataka Elections 2023

Updated On : May 12, 2023 / 7:42 AM IST

Karnataka Elections 2023: దక్షిణాదిన కీలకమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ మెజార్టీ సాధిస్తోందని ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందనే సూచనలు ఇచ్చాయి.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి (HD Kumaraswamy)కి చెందిన జనతాదళ్ సెక్యూలర్ (Janata Dal Secular) పార్టీ మళ్లీ కింగ్ మేకర్ గా మారే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీతో కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే సంప్రదింపులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

కర్ణాటకలో హంగ్ ఏర్పడితే కాంగ్రెస్, బీజేపీ కలిసే అవకాశాలు ఉండవు కాబట్టి, ఆ రెండు పార్టీల్లో ఏదైనా ఓ పార్టీ జేడీఎస్ తోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలో జేడీఎస్ సీనియర్ నేత తన్వీర్ అహ్మద్ కీలక విషయాలు తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నుంచి సంప్రదింపులు మొదలయ్యాయని అన్నారు. ఏ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న విషయంపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

కుమారస్వామి సింగపూర్ వెళ్లారని అన్నారు. ఏ పార్టీతో కలుస్తామన్న విషయంపై సరైన సమయంలో ప్రకటన చేస్తామని తెలిపారు. తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. జేడీఎస్ తో చర్చలు జరపలేదని బీజేపీ నాయకురాలు, కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. తమకు పూర్తి మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Karnataka Polls: మీకు తెలుసా, కర్ణాటకలో 1999 నుంచి కాంగ్రెసే టాప్. అయినా కూడా..?