Assembly Elections 2023: కాంగ్రెస్ అభ్యర్థులను ఎలా ఎంపిక చేశారు? పెద్ద విషయమే వెల్లడించిన దిగ్విజయ్ సింగ్
2018 సంవత్సరంలో మాకు ఇంత సన్నద్ధం లేదు. ఎందుకంటే కమల్‌నాథ్‌కు సిద్ధం కావడానికి తక్కువ సమయం దొరికింది. ఆ సమయంలో శివరాజ్ సింగ్‌పై ఈ రోజు ఉన్నంత ప్రభుత్వ వ్యతిరేకత లేదు

Digvijay Singh: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. 230 అసెంబ్లీ స్థానాలకు గానూ ఆ పార్టీ 229 మంది అభ్యర్థులను రెండు విడతల్లో ప్రకటించింది. కాగా, కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పెద్ద ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో పార్టీ పారదర్శక పద్ధతిని అవలంబించిందని చెప్పారు. వాస్తవానికి ఇంత పారదర్శకతతో అభ్యర్థుల ఎంపిక ఎప్పుడూ జరగలేదని, తన రాజకీయ జీవితంలో ఇదే మొదటిసారని దిగ్విజయ్ సింగ్ అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మధ్యప్రదేశ్‌లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంతకు ముందెన్నడూ జరగలేదు. 2018తో పోలిస్తే ఈసారి మెరుగైన సన్నద్ధతతో ఉన్నాం. మేము మొదటిసారిగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో బ్లాక్ క్రింద ఉన్న మండల్, సెక్టార్, బూత్‌కు చేరుకున్నాము. 2018 సంవత్సరంలో మాకు ఇంత సన్నద్ధం లేదు. ఎందుకంటే కమల్‌నాథ్‌కు సిద్ధం కావడానికి తక్కువ సమయం దొరికింది. ఆ సమయంలో శివరాజ్ సింగ్‌పై ఈ రోజు ఉన్నంత ప్రభుత్వ వ్యతిరేకత లేదు’’ అని అన్నారు.
ఇది కూడా చదవండి: Mumbai: స్పా సెంటర్లో సెక్స్ రాకెట్.. రైడ్ చేసి 9 మంది బాలికల్ని కాపాడిన పోలీస్
ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘‘ఈ ఎంపిక ప్రక్రియలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం సహజం. ఎందుకంటే ప్రతి అభ్యర్థి నేనే ఉత్తమ అభ్యర్థి అని భావిస్తారు. మేము జిల్లా, బ్లాక్ నుంచి అభ్యర్థుల పేర్లను తీసుకున్నాము. మొదటిసారి ఏఐసీసీ రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ జిల్లా అధ్యక్షులను ఎంపిక చేసింది. నా రాజకీయ జీవితంలో ఇదే తొలిసారి. అభ్యర్థులను ఇంత పారదర్శకంగా ఎప్పుడూ ఎంపిక చేయలేదు’’ అని అన్నారు.