Assembly Elections 2023: ఈసారి ఓటింగ్ తగ్గింది.. ఛత్తీస్‌గఢ్, మిజోరాంలలో నమోదైన పోలింగ్ ఎంతంటే?
ఛత్తీస్‌గఢ్‌లో అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు జరిగాయి. ఇక మిజోరాంలో పూర్తిగా సానుకూల వాతావరణంలో పోలింగ్ ముగిసినట్లు ఆ రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి ప్రకటించారు

Assembly Elections 2023: మిజోరాం అసెంబ్లీ సహా ఛత్తీస్‌గఢ్‌లోని 20 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం జరిగిన పోలింగ్ ముగిసింది. అయితే ఈసారి పోలింగ్ తక్కువగా నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇరు రాష్ట్రాల్లో చాలా తక్కువ పోలింగ్ నమోదు అయింది. ఛత్తీస్‌గఢ్‌లో 2018 77.23 శాతం పోలింగ్ నమోదు అవగా.. ఈసారి కేవలం 71.11 (కేవలం 20 నియోజకవర్గాలు మాత్రమే) శాతమే నమోదు అయింది. ఇక మిజోరాం అసెంబ్లీకి 2018లో 80.03 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈ సారి కేవలం 77.39 శాతమే నమోదు అయింది.
ఛత్తీస్‌గఢ్‌లో అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు జరిగాయి. ఇక మిజోరాంలో పూర్తిగా సానుకూల వాతావరణంలో పోలింగ్ ముగిసినట్లు ఆ రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి ప్రకటించారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా చెప్పుకుంటున్న ఈ అసెంబ్లీ ఎన్నికల కౌంట్ డౌన్ ఈరోజే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అయితే ఇది సమస్యాత్మకానికి వెళ్లకుండా పూర్తి సానుకూల వాతావరణంలో ముగియడం పట్ల ఎన్నికల సంఘం హర్షం వ్యక్తం చేసింది.