Karnataka Polls: కర్ణాటకకు ఇస్తున్నారా కర్ణాటకను దోచుకుంటున్నారా?.. అమూల్ వివాదంపై బీజేపీ మీద ధ్వజమెత్తిన సిద్ధరామయ్య

Karnataka Polls: కర్ణాటకకు ఇస్తున్నారా కర్ణాటకను దోచుకుంటున్నారా?.. అమూల్ వివాదంపై బీజేపీ మీద ధ్వజమెత్తిన సిద్ధరామయ్య

Siddaramaiah

Updated On : April 9, 2023 / 2:52 PM IST

Karnataka Polls: అమూల్ పాల వివాదాన్ని మరింత వేడెక్కించి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మరింత దెబ్బకొట్టాలని విపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ వివాదాన్ని లక్ష్యంగా చేసుకుని అధికార బీజేపీపై మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శనాస్త్రాలు సంధించారు. గుజరాత్ వ్యాపారాలను పెంచుకోవడానికి కర్ణాటక ఆస్తులను కూలదోస్తున్నారంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదివారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Karnataka Polls: కర్ణాటక ఎన్నికల్లో కాషాయ పార్టీని కలవర పెడుతున్న అమూల్ పాల వివాదం

‘‘కర్ణాటకకు ఎన్నో ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. కానీ వాస్తవంలో.. కన్నడ బ్యాంకులను దోచుకున్నారు, పోర్టులను ఎయిర్‭పోర్టును దోచుకున్నారు. ఇప్పుడు కన్నడిగుల నందిని పాలను కూడా దోచుకోవాలని చూస్తున్నారు. ఇది రాష్ట్రానికి ఇస్తున్నట్టా, రాష్ట్రాన్ని దోచుకుంటున్నట్టా? గుజరాత్ బరోడా బ్యాంకులో కన్నడ విజయ బ్యాంకును విలీనం చేశారు. పోర్టులను ఎయిర్‭పోర్టును అదానీ కంపెనీలకు అంటగట్టారు. ఇప్పుడు కన్నడ నందిని పాలను గుజరాత్ అమూల్ పాలలో కలిపేయాలని కుట్రలు పన్నుతున్నారు’’ అని సిద్ధరామయ్య విమర్శలు గుప్పించారు.

Rajasthan Politics: మాజీ సీఎం.. ప్రస్తుతం సీఎం.. సచిన్ పైలట్ టార్గెట్ ఎవరు?

‘‘ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చెప్పారు. కానీ బ్యాంకుల్లో ఎయిర్‭పోర్టుల్లో ఉన్న ఉద్యోగాలను ఖాళీ చేశారు. రాష్ట్రంలో పాల దిగుబడి పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లీడరుకు 5 రూపాయల ప్రోత్సాహం ఇచ్చాం. దాని వల్ల రాష్ట్ర పాల దిగుబడి 2012లో ఉన్న 45 లక్షల లీటర్ల నుంచి 2017 వచ్చే సరికి 73 లక్షల లీటర్లకు పెరిగింది’’ అని అని సిద్ధరామయ్య అన్నారు.