Karnataka Polls: బీజేపీకి కన్నడ హీరో సుదీప్ మద్దతు ఇవ్వడంపై కాంగ్రెస్ రియాక్షన్ ఇదే

ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా మద్దతు ఇచ్చినట్టేనా అని ప్రశ్నించగా.. ‘‘ప్రధాని మోదీ తీసుకున్న కొన్ని నిర్ణయాల మీద నాకు సానుకూల అభిప్రాయం ఉంది. అయితే నేనిక్కిడ (బీజేపీకి మద్దతుగా) కూర్చోవడానికి దానికి సంబంధం లేదు’’ అని సుదీప్ క్లారిటీ ఇచ్చారు.

Karnataka Polls: బీజేపీకి కన్నడ హీరో సుదీప్ మద్దతు ఇవ్వడంపై కాంగ్రెస్ రియాక్షన్ ఇదే

randeep singh surjewala

Updated On : April 5, 2023 / 5:52 PM IST

Karnataka Polls: కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్.. మరికొద్ది రోజుల్లో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తానని బుధవారం ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారమే లేసినట్టైంది. సర్వేల్లో అనుకూల ఫలితాలు రావడంతో హుషారుగా ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇది కాస్త కలవరపెట్టేదిగానే ఉంది. అయితే ఎన్నికల మీద ఇది అంతగా ప్రచారం చూపించబోదని కాంగ్రెస్ పేర్కొనడం గమనార్హం.

Supreme Court: విపక్షాలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కోర్టులో కాదు, రాజకీయంగా చూసుకోవాలన్న ధర్మాసనం

కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇంచార్జీ రణ్‭దీప్ సూర్జేవాలా మాట్లాడుతూ ‘‘బీజేపీ ఎవరినైనా ప్రభావితం చేయగలుగుతుంది. కానీ ఈ ఎన్నికలను మాత్రం ఆరున్నర కోట్ల కన్నడ సోదరసోదరీమణులే ప్రభావితం చేస్తారు. సినిమా వాళ్లు ప్రభావితం ఉండదు’’ అని కొట్టేపారేశారు. బయటికి సులువగానే చెప్పినప్పటికీ.. సుదీప్ ప్రచారం ప్రభావం ఏమైనా ఉంటుందేమోనని ఇప్పటికే రాష్ట్ర పార్టీ విభాగాన్ని కాంగ్రెస్ అధిష్టానం వివరణ కోరినట్లు సమాచారం.

Ghulam Nabi Azad : కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యానికి తావు లేదు.. అగ్రనాయకత్వంపై గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు

భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తానని అన్నారు. అది కూడా ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కోసం. అంతకు మించి తాను బీజేపీలో చేరనని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని స్పష్టతనిచ్చారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం బొమ్మైతో కలిసి సుదీప్ మాట్లాడారు. ‘‘నేను కేవలం బీజేపీ కోసం ప్రచారం చేస్తాను. కానీ ఎన్నికల్లో పోటీ చేయను. పార్టీలో కూడా చేరడం లేదు. సీఎం బొమ్మై కోసం ఏదైనా చేస్తాను. ఆయనకు మద్దతు ఇచ్చానంటే.. ఆయన సూచించిన వారందరికీ కూడా మద్దతు ఇచ్చినట్టే. ఆయన చెప్పినవారందరికీ ప్రచారం చేస్తాను’’ అని కిచ్చా అన్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా మద్దతు ఇచ్చినట్టేనా అని ప్రశ్నించగా.. ‘‘ప్రధాని మోదీ తీసుకున్న కొన్ని నిర్ణయాల మీద నాకు సానుకూల అభిప్రాయం ఉంది. అయితే నేనిక్కిడ (బీజేపీకి మద్దతుగా) కూర్చోవడానికి దానికి సంబంధం లేదు’’ అని క్లారిటీ ఇచ్చారు.

Bandi Sanjay: పేపర్ లీక్ కేసులో ఏ1గా బండి సంజయ్.. వాహనంపై రాళ్లు, చెప్పులు విసిరిన టీఆర్ఎస్ కార్యకర్తలు

224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనున్నాయి. ఇక మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కొద్ది రోజుల క్రితమే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రధాన విపక్షం కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ కొనసాగనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే రాష్ట్రంలో మూడో పెద్ద పార్టీగా ఉన్న జేడీఎస్ ను అంత సులువుగా తీసుకోలేమని కూడా అంటున్నారు. గతంలో పలుమార్లు ఈ పార్టీ వల్ల కాంగ్రెస్, బీజేపీలు మెజారిటీని రాబట్టడంలో విఫలమయ్యాయి.