Karnataka Polls: బీజేపీలో వ్యతిరేకత, సిద్ధరామయ్య పాపులారిటీ.. ఎగ్జిట్ పోల్స్‭లో వెల్లడైంది ఇదేనట

రాష్ట్రంలోని ఆరు ప్రధాన ప్రాంతాలైన.. పాత మైసూర్ (64 స్థానాలు), బాంబే కర్ణాటక (50 స్థానాలు), హైదరాబాద్ కర్ణాటక (40 స్థానాలు), బెంగళూరు (28 స్థానాలు), సెంట్రల్ కర్ణాటక (23 స్థానాలు), కోస్టల్ కర్ణాటక (19 సీట్లు)లలో అతి చిన్న ప్రాంతమైన కోస్టల్ కర్ణాటకలో మాత్రమే బీజేపీ బలంగా ఉందని సర్వే తెలిపింది

Karnataka Polls: బీజేపీలో వ్యతిరేకత, సిద్ధరామయ్య పాపులారిటీ.. ఎగ్జిట్ పోల్స్‭లో వెల్లడైంది ఇదేనట

Karnataka Polls: ఎట్టకేలకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మే 13న ఫలితాలు వెల్లడవుతాయి. అయితే ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఎక్కువ అంచనాలు వచ్చాయి. దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ హవా కొనసాగుతోంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా కమల వికాసమే కనిపిస్తోంది. అలాంటిది.. ఎంతగానో పట్టున్న, పైగా అధికారంలో ఉన్న కర్ణాటకలో బీజేపీ ఓడుతుందని అటు ఒపీనియన్ పోల్స్, ఇటు ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి.

Golden Temple: గోల్డెన్ టెంపుల్ వద్ద మరో పేలుడు.. ఐదు రోజుల్లో మూడో సారి ..! భయాందోళనలో స్థానికులు

13న వచ్చే ఫలితాల సంగతి పక్కన పెడితే.. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు బీజేపీ ఓటమికి కాంగ్రెస్ గెలవడానికి గల కారణాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై నేతృత్వంలోని ప్రభుత్వం మీద రాష్ట్ర బీజేపీ నాయకులే నాయకులే తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేతకు అప్పటికే ఉన్న జనాదరణకు తోడు మరింత ఆదరణ పెరిగిందని, అదే బీజేపీ ఓటమికి, కాంగ్రెస్ విజయానికి కారణమవుతోందని తెలిపారు.

The Kerala Story : ఇండియాలో 50 కోట్లు కొల్లగొట్టిన ది కేరళ స్టోరీ.. ఇప్పుడు ఏకంగా 37 దేశాల్లో విడుదల..

గడిచిన ఐదేళ్లలో మారిన మూడు ప్రభుత్వాల కంటే సిద్ధరామయ్య ప్రభుత్వమే అత్యుత్తమమైందని ఎక్కువ మంది ఓటర్లు భావిస్తున్నారట. 27 శాతం మంది సిద్ధరామయ్యనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంటే.. కేవలం 15 శాతం మంది మాత్రమే బొమ్మై సీఎం కావాలని అనుకుంటున్నారట. ఇక జనతాదళ్ సెక్యూలర్ నేత హెచ్‭డీ కుమారస్వామి ముఖ్యమంత్రి కావాలని కూడా 15 శాతం మంది ఓటర్లు కోరుకుంటున్నట్లు సర్వే వెల్లడించింది.

Andhra Pradesh : ఏపీ ఆర్థిక పరిస్థితి‎పై కావాలనే తప్పుడు ప్రచారం : సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ

రాష్ట్రంలోని ఆరు ప్రధాన ప్రాంతాలైన.. పాత మైసూర్ (64 స్థానాలు), బాంబే కర్ణాటక (50 స్థానాలు), హైదరాబాద్ కర్ణాటక (40 స్థానాలు), బెంగళూరు (28 స్థానాలు), సెంట్రల్ కర్ణాటక (23 స్థానాలు), కోస్టల్ కర్ణాటక (19 సీట్లు)లలో అతి చిన్న ప్రాంతమైన కోస్టల్ కర్ణాటకలో మాత్రమే బీజేపీ బలంగా ఉందని సర్వే తెలిపింది. మిగిలిన 5 ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందట. ఎన్నడూ లేని విధంగా మైసూర్ ప్రాంతంలో బీజేపీ ఓట్ బ్యాంకు పెంచుకున్నప్పటికీ.. అక్కడ జేడీఎస్ ప్రభావవంతంగా ఉండడం వల్ల.. బీజేపీ మూడో స్థానంలోనే ఉంటుందట.

Uddhav Thackeray: ఉద్దవ్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేం.. సుప్రింకోర్టులో ఉద్దవ్ వర్గానికి దక్కని ఊరట

ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, కురుబ (సిద్ధరామయ్య సామాజికవర్గం) ఓట్ బ్యాంకులో సింహభాగం కాంగ్రెస్ పార్టీకే వెళ్లిందట. బీజేపీకి లింగాయత్, జనరల్, ఓబీసీ ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్, బీజేపీలు ఓట్లను పెంచుకోగా.. గ్రామాల్లో జేడీఎస్ ఓట్లు పెరిగినట్లు తెలుస్తోంది. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ 122-140 స్థానాలు గెలుస్తుందని చెప్పారు. ఇక భారతీయ జనతా పార్టీ 62-80 స్థానాల్లో ఆగిపోతుందట.