Isudan Gadhvi: గుజరాత్ ఆప్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్
తమ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రజలే ఎన్నుకోవాలని ఒక బహిరంగ పోల్ నిర్వహించారు. ఒక ఫోన్ నంబరు ఇచ్చి తమకు ఇష్టమైన అభ్యర్థి ఎవరో మెసేజ్ లేదంటే వాట్సాప్ సందేశం ద్వారా తెలియజేయాలని కోరారు. దీని ప్రకారం.. అప్పటి ఎంపీ భగవంత్ మాన్కు అనుకూలంగా ఎక్కువ మంది ప్రజలు సందేశాలు పంపారు. దీంతో ఎన్నికల ముందే ఆప్ అభ్యర్థి ఖరారు అయ్యారు. ఇక ఇదే ఫార్ములాను గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమలు చేయాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు.

Kejriwal announced Isudan Gadhvi as AAP's CM face in Gujarat
Isudan Gadhvi: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించారు ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. సీఎం అభ్యర్థి ఎంపికపై ప్రజా అభిప్రాయాన్ని కోరిన ఆప్.. ఆ పార్టీకి చెందిన ఇసుదాన్ గాధ్వీని ప్రజలు ఎన్నుకున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్నికల తేదీలను ప్రకటించడంతో కేజ్రీవాల్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే గుజరాత్‌లో విస్తృతంగా పర్యటిస్తున్న కేజ్రీవాల్.. బీజేపీ ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆప్ ఇదే స్ట్రాటజీని అమలు చేసింది. వాస్తవానికి అప్పట్లో ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో కొంత గందరగోళం ఉండేంది. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకవేళ ఆప్ అధికారంలోకి వస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని వదులుకుని కేజ్రీవాల్ పంజాబ్‌కు వస్తారనే ఆరోపణలు అనేకం వచ్చాయి. కాగా ఈ యేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల్లో అదే అయోమయం చెలరేగింది. పైగా ఈ విషయమై విపక్షాల నుంచి ప్రజల నుంచి కూడా విమర్శలు వచ్చాయి.
దీంతో.. తమ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రజలే ఎన్నుకోవాలని ఒక బహిరంగ పోల్ నిర్వహించారు. ఒక ఫోన్ నంబరు ఇచ్చి తమకు ఇష్టమైన అభ్యర్థి ఎవరో మెసేజ్ లేదంటే వాట్సాప్ సందేశం ద్వారా తెలియజేయాలని కోరారు. దీని ప్రకారం.. అప్పటి ఎంపీ భగవంత్ మాన్కు అనుకూలంగా ఎక్కువ మంది ప్రజలు సందేశాలు పంపారు. దీంతో ఎన్నికల ముందే ఆప్ అభ్యర్థి ఖరారు అయ్యారు. ఇక ఇదే ఫార్ములాను గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమలు చేయాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు.
అచ్చం ఇలాగే.. గుజరాత్ ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించారు. 6357000360 అనే నంబరుతో పాటు aapnocm@gmail.com అనే ఈమెయిల్ ద్వారా ఆప్ తరపు అభ్యర్థిని ఎన్నుకోవాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా వచ్చిన ఓట్ల ఆధారంగా శుక్రవారం ఇసుదాన్ గాధ్వీని అత్యధిక మంది ఎన్నుకున్నట్లు, ఆయనే తమ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థని కేజ్రీవాల్ ప్రకటించారు.