ALIMCO Job Vacancies : ఆర్టిఫీషియల్‌ లింబ్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఖాళీల పోస్టుల భర్తీ

కోఫా, ఫిట్టర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, పెయింటర్‌, వెల్డర్‌ ట్రేడుల్లో పోస్టుల ఖాళీలు ఉన్నాయి. ఖాళీల వివరాలకు సంబంధించి కోఫా ఖాళీలు 3, ఫిట్టర్ ఖాళీలు 2, టర్నర్ ఖాళీలు 1, మెషినిస్ట్ ఖాళీలు 1 , పెయింటర్ ఖాళీలు 1, వెల్డర్ ఖాళీలు 2 ఉన్నాయి.

ALIMCO Job Vacancies : ఆర్టిఫీషియల్‌ లింబ్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఖాళీల పోస్టుల భర్తీ

Artificial Limbs Manufacturing Corporation of India Vacancies

Updated On : November 4, 2022 / 5:16 PM IST

ALIMCO Job Vacancies : భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన ఆర్టిఫీషియల్‌ లింబ్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఖాళీల పోస్టుల భర్తీ చేపట్ట నున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

కోఫా, ఫిట్టర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, పెయింటర్‌, వెల్డర్‌ ట్రేడుల్లో పోస్టుల ఖాళీలు ఉన్నాయి. ఖాళీల వివరాలకు సంబంధించి కోఫా ఖాళీలు 3, ఫిట్టర్ ఖాళీలు 2, టర్నర్ ఖాళీలు 1, మెషినిస్ట్ ఖాళీలు 1 , పెయింటర్ ఖాళీలు 1, వెల్డర్ ఖాళీలు 2 ఉన్నాయి. అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఇంటర్మీడియట్‌, సంబంధిత ట్రేడుల్లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

విద్యార్హతలు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.7,700ల నుంచి రూ.8,050ల వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఫ్రెషర్లకు రూ.6000ల చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో నవంబర్‌ 22, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.apprenticeshipindia.gov.in/ పరిశీలించగలరు.