2024 Elections: ఆ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ.. 2024లో ఎన్డీయేకు ఒక్క సీటు కూడా రాదట
ఇక ఈ రాష్ట్రాలతో పాటు మణిపూర్ రాష్ట్రంలో కూడా బీజేపీకి అదే పరిస్థితి ఎదురుకానుందట. మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. సర్వే ప్రకారం అక్కడ ఎన్డీయే ఫ్లాప్ అని కనిపిస్తోంది

NDA: వచ్చే లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాలుగు రాష్ట్రాల్లో ఘోర పరాభవం కానున్నట్లు ఒక సర్వే తెలిపింది. ఆ పార్టీ కూటమి అయిన నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ కి ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఆ నాలుగు రాష్ట్రాల్లో రాదట. సీఎన్ఎక్స్ అనే సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మూడు నెలలుగా అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రంతో పాటు కేరళ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో బీజేపీకి కానీ, బీజేపీ మిత్రపక్షాలకు కానీ ఒక్క సీటు కూడా రాదని సీఎన్ఎక్స్ సర్వే అంచనా వేసింది.
Gyanvapi Issue: జ్ఞానవాపిని మసీదు అంటే గొడవలు జరుగుతాయట.. సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు
కేరళలో 20 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములదే హవా. ఇక్కడ బీజేపీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవదు. అలాగే బీజేపీ మిత్ర పక్షాలకు కూడా అవకాశం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలు ఉండగా.. టీడీపీ, వైసీపీలదే హవా. రాష్ట్రంలో జనసేనతో బీజేపీ పొత్తు ఉన్నప్పటికీ ఒక్క సీటు కూడా ఈ పార్టీకి రాదట. అలాగే పంజాబ్ రాష్ట్రంలోనూ అదే పరిస్థితి. మొన్నటి వరకు బీజేపీతో దోస్తీ చేసిన అకాలీ దళ్ పార్టీ.. రైతు ఆందోళన సమయంలో పొత్తు తెంచుకుంది. దీంతో బీజేపీకి ఏమాత్రం గ్రాఫ్ లేకుండా పోయింది.
Tamil nadu Court :35 ఏళ్లనాటి కేసు,ఆర్టీసీ మాజీ ఉద్యోగికి 383 ఏళ్ల జైలుశిక్ష, రూ.3.32 కోట్ల జరిమానా
ఇక ఈ రాష్ట్రాలతో పాటు మణిపూర్ రాష్ట్రంలో కూడా బీజేపీకి అదే పరిస్థితి ఎదురుకానుందట. మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. సర్వే ప్రకారం అక్కడ ఎన్డీయే ఫ్లాప్ అని కనిపిస్తోంది. 2024లో ఇక్కడ బీజేపీ కూటమికి ఒక్క సీటు కూడా వచ్చేలా కనిపించడం లేదు. మణిపూర్‌లో 2 లోక్సభ స్థానాలు ఉండగా బీజేపీ కూటమి వాటిని కదిలించే ప్రసక్తే లేదట.